Anchor Shyamala : యాంకర్ శ్యామలపై టీడీపీ సోషల్ మీడియా దరిద్రపుగొట్టు రాతలు!
తెలుగుదేశం పార్టీ(TDP) సోషల్ మీడియా ఫెల్లోస్‌కు ఇంగితం నశించింది. మొన్నామధ్య గీతాంజలి అనే మహిళను ఇష్టం వచ్చినట్టుగా తూలనాటి, ఆమె వ్యక్తిత్వహనానికి పాల్పడిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆమె ప్రాణం తీసుకునేంత వరకు ఆగలేదు. ఆమె ఆత్మహత్యకు తాము కారకులమన్న పశ్చాత్తాపం వారిలో కొంచెం కూడా లేదు. ఆమె చనిపోయిన తర్వాత కూడా అడ్డమైన రాతలు రాశారు. ఇప్పుడు ప్రముఖ యాంకర్ శ్యామలపై(anchor shyamala) కూడా ఎల్లో బ్యాచ్ తమదైన శైలిలో ట్రోలింగ్‌కు తెగబడుతోంది.
తెలుగుదేశం పార్టీ(TDP) సోషల్ మీడియా ఫెల్లోస్‌కు ఇంగితం నశించింది. మొన్నామధ్య గీతాంజలి అనే మహిళను ఇష్టం వచ్చినట్టుగా తూలనాటి, ఆమె వ్యక్తిత్వహనానికి పాల్పడిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆమె ప్రాణం తీసుకునేంత వరకు ఆగలేదు. ఆమె ఆత్మహత్యకు తాము కారకులమన్న పశ్చాత్తాపం వారిలో కొంచెం కూడా లేదు. ఆమె చనిపోయిన తర్వాత కూడా అడ్డమైన రాతలు రాశారు. ఇప్పుడు ప్రముఖ యాంకర్ శ్యామలపై(anchor shyamala) కూడా ఎల్లో బ్యాచ్ తమదైన శైలిలో ట్రోలింగ్‌కు తెగబడుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(ycp) మద్దతుగా శ్యామల ప్రచారం చేయడం టీడీపీ, జనసేన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) మద్దతుగా జబర్దస్త్ కమెడియన్లు, ఇతర టెలివిజన్ నటీనటులు ప్రచారం చేయవచ్చు కానీ వైసీపీ తరఫున ఎవరైనా ప్రచారం చేస్తే విలవిలలాడిపోతున్నారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేయగానే తాము ఏమైపోతామోనన్న భయం ప్రత్యర్థులకు కలిగింది. ఆమె ప్రచారానికి రాకుండా చేయాలని కుతంత్రం పన్నారు టీడీపీ, జనసేన మద్దతుదారులు. ఆమె మానసికస్థయిర్యాన్ని దెబ్బ తసి , తద్వారా మరెవ్వరూ వైసీపీ తరఫున ప్రచారం చేయకుండా భయపెట్టాలని తెలుగుదేశంపార్టీ బ్యాచ్ భావించింది. ట్రోలింగ్‌కు దిగింది. పిఠాపురంలో వంగా గీత తరపున ప్రచారం చేస్తున్నారు శ్యామల. గీత విజయం ఎప్పుడో ఖరారయ్యిందని, తనలాంటి వారంతా కేవలం మెజారిటీ పెంచుకునేందుకే ప్రచారం చేస్తున్నామని శ్యామల చెప్పుకొచ్చారు. దీన్ని టీడీపీ, జనసేన తట్టుకోలేకపోయాయి. వెంటనే తమ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉసిగొల్పింది. వాళ్లు బౌబౌ మనడం మొదలు పెట్టారు. శ్యామల వ్యక్తిగత విషయాలపై ఉన్నవి లేనివి కల్పించి చెప్పసాగారు. ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా నీచమైన రాతలు రాస్తున్నారు. కాకినాడ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్యామలపై సభ్యసమాజం తలదించుకునేలా ట్రోల్ చేయడాన్ని తప్పుపడుతున్నారు చాలా మంది. అయినా వారు మాత్రం మారడం లేదు. మారితే వారు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎలా అవుతారు.. వాళ్లు మారరుగాక మారరు.