TDP Ganta Srinivas Rao : మీరు పెట్టిన చిచ్చు మిమ్మల్నే చుట్టు ముట్టబోతోంది..
టీడీపీ(TDP) సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta srinivas Rao) వైఎస్ఆర్ కుటుంబ(YSR Family) తాజా పరిస్థితులపై సంచలన ట్వీట్(Tweet) చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన జగన్‌కు(Jagan) పలు ప్రశ్నలు సంధించారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పటి పరిప్థితుల వరకూ అన్ని వివరిస్తూ.. మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు.
టీడీపీ(TDP) సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta srinivas Rao) వైఎస్ఆర్ కుటుంబ(YSR Family) తాజా పరిస్థితులపై సంచలన ట్వీట్(Tweet) చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన జగన్‌కు(CM Jagan) పలు ప్రశ్నలు సంధించారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పటి పరిప్థితుల వరకూ అన్ని వివరిస్తూ.. మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు.
ఆయన ట్వీట్‌లో.. మీ నాన్న గారి హయాంలో ఒకే మాట.. ఒకే బాటగా.. ఉండే కుటుంబాన్ని తమరి నిర్వాకంతోనే రెండుగా చీలి పోయిందన్న లోగుట్టు ప్రపంచమంతా ఎరుకు.. జగనన్న.. మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ఈరోజు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.? మీరు జైళ్లో ఉన్నా సమయంలో మీ విజయానికి అహర్నిశలు శ్రమించిన మీ తల్లి(YS Sharmila), చెల్లి కష్టాన్ని వాడుకుని సీఎం అయ్యాక వారిని బయటకి తరిమేసిన మాట నిజం కాదా.. అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో(AP Politics) జగనన్న వదిలిన బాణాన్ని అని మీకోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లికి అన్యాయం చెయ్యమని ఏ పార్టీ చెప్పింది.. ఏ నాయకుడు చెప్పాడు.? మీ చెల్లికి ఆస్థి పంపకాల్లో అన్యాయం చెయ్యమని, ఎంపీ టికెట్ ఇవ్వొద్దని ఏ పార్టీ చెప్పింది.. ఏ నాయకుడు చెప్పాడు.? ఢిల్లీలో తన తండ్రి హత్య కేసు నిందితుల్ని శిక్షించాలని కాళ్ళు అరిగేలా తిరుగుతున్న మరొక చెల్లికి న్యాయం చెయ్యొదని ఏ పార్టీ చెప్పింది.. ఏ నాయకుడు చెప్పాడు.? అని ప్రశ్నించారు. తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని గౌరవించలేనివాడు.. సమాజాన్ని కూడా గౌరవించలేడనే విషయం మరోసారి మీ ద్వారా నిరూపితం అయ్యింది. మీరు పెట్టిన చిచ్చే రాబోయే ఎన్నికల్లో మిమ్మల్నే చుట్టు ముట్టబోతోందని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు.
మీ నాన్న గారి హయాంలో ఒకే మాట..
ఒకే బాటగా... ఉండే కుటుంబాన్ని తమరి నిర్వాకంతోనే రెండుగా చీలి పోయిందన్న లోగుట్టు ప్రపంచమంతా ఎరుకు.. జగనన్నమా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ఈరోజు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు...?
మీరు జైళ్లో ఉన్నా సమయంలో మీ విజయానికి అహర్నిశలు శ్రమించిన…
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) January 4, 2024