మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింత కాయల అయ్యన్నపాత్రుడిని(Ayyanna Pathrudu) పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులు చింతకాయల అయ్యన్న పాత్రుడుని అరెస్ట్ చేసారు. అయ్యన్నపాత్రుడి పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన నారా లోకేశ్(Nara Lokesh) యువగళం బహిరంగ సభలో అయ్యన్న పాత్రుడు మాట్లాడారు.

మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింత కాయల అయ్యన్నపాత్రుడిని(Ayyanna Pathrudu) పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులు చింతకాయల అయ్యన్న పాత్రుడుని అరెస్ట్ చేసారు. అయ్యన్నపాత్రుడి పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన నారా లోకేశ్(Nara Lokesh) యువగళం బహిరంగ సభలో అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) దగ్గర నుంచి పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా(RK Roja), మంత్రులు అంబటి రాంబాబు(Ambati Rambabu), మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నాని,అనిల్ కుమార్ యాదవ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే మంత్రి ఆర్‌కే రోజాపై టూరిజం అభివృద్ధి చేయి రోజా అని అడిగితేనా సొగసు చూడు మాయా అంటుంది అంటూ అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఈ విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నానితో(perni nani) పాటు ఇతర నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి ఆర్‌.కే రోజాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై 153 ఏ,354 ఏ 1(4), 504,505(2),509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. అయితే శుక్రవారం ఢిల్లీ నుంచి అయ్యన్నపాత్రుడు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసి కృష్ణా జిల్లాకు తరలించారు. అనంతరం దారిలో అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం వద్ద విడిచి పెట్టేసారు. అనంతరం ఆయన నక్కపల్లి వద్ద ఉన్న జాష్ హోటల్ కు చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని నిలబడతాను వెనకడుగు వేయనని అయ్యన్న పాత్రుడు అన్నారు. రాక్షస పాలన నుండి ప్రజలను కాపాడుతాం. ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు జీపులో తీసుకు వెళ్లారు. సిఐ కి కాల్ చేసారు ఎవ్వరో అరెస్టు చేయమని చెప్పారని అన్నారు. 41 నోటీసు ఇవ్వమని అడిగాను వెంటనే అప్పుటి కప్పుడు తయారు చేసి ఇచ్చారని, నోటీసు అందిన పదిరోజులకు కలవాలని చెప్పారు. జగన్ గురించి నేను ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు.
సిబిఐ కేసులు గురించే చెప్పానని ఆయన తెలిపారు.

Updated On 1 Sep 2023 6:11 AM GMT
Ehatv

Ehatv

Next Story