TTD Board Chairperson : టీటీడీ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న రాఘవేంద్రరావు, అశ్వనీదత్
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(TTD Board Chairman) ఛైర్మన్ పదవి అంటే మంత్రి పదవి కంటే ఎక్కువ!
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(TTD Board Chairman) ఛైర్మన్ పదవి అంటే మంత్రి పదవి కంటే ఎక్కువ! ఆ మాటకొస్తే సభ్యుల పోస్టులు కూడా పవర్‌ఫుల్లే అనుకోండి. అందుకే వీటికి డిమాండ్ చాలా ఎక్కువ! ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ(TDP012) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్నదానిపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆ మధ్యన ఒకరిద్దరి పేర్లు గట్టిగా వినిపించాయి కానీ తర్వాత ఆ ఊసే లేదు. ఇక టీటీడీ మెంబర్ అవ్వాలనే కోరిక బాగా డబ్బున్నవాళ్లకు ఎక్కువగా ఉంటుంది. బడా పారిశ్రామికవేత్తలు, బడా బడా కాంట్రాక్టర్లు, అధికారపార్టీకి చెందిన నాయకులకు కూడా ఈ కోరిక బలంగా ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్త బోర్డు నియామకం కాలేదు. అప్పటి వరకు అన్నట్టుగా టీటీడీకి ఓ ఎగ్జిక్యూటివ్ అధికారిని, మరో అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించింది కూటమి ప్రభుత్వం. అంటే ఇప్పట్లో బోర్డు నిమాయకం జరగదనే అనిపిస్తోంది. ఆ మధ్యన టీవీ 5 ఛైర్మన్ బి.ఆర్.నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవిని కట్టబెడుతున్నారనే వార్త సర్క్యూలేట్ అయ్యింది. అదంతా వట్టి గ్యాస్ అని తర్వాత తెలిసింది. కూటమి గెలిచిన కొత్తలో అయితే డిప్యూటీ సీఎం పవర్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఈ పదవిని కోరుతున్నారనే టాక్ వినిపించింది. అయితే నాగబాబు ఈ విషయాన్ని ఖండించారనుకోండి. సరే చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలన్నది చంద్రబాబు డిసైడ్ చేస్తారనుకోండి.. సభ్యుల పోస్టుల కోసం కూడా ఆశావహులు చాలా మందే ఉన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్‌లు కూడా టీటీడీ మెంబర్ పోస్టు కోసం ఆశపడుతున్నారట! మురళీమోహన్ కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలిసింది. రాఘవేంద్రరావు, అశ్వనీదత్‌లు అయితే చాలా గట్టిగానే ఎఫర్ట్ పెడుతున్నారట! ఇక పవన్ కల్యాణ్ సైడ్ నుంచి కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. నాగబాబు, నిర్మాత విశ్వప్రసాద్, దర్శకుడు త్రివిక్రమ్ పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే పొత్తులో భాగంగా తెలుగుదేశంపార్టీకి చెందిన చాలా మంది నాయకులు తమ స్థానాలను త్యాగం చేశారు. వారికి సంతృప్తికరమైన పోస్టులు ఇవ్వాలి. టీటీడీ సభ్యులను చేస్తే వారంతా కళ్లకు అద్దుకుంటు తీసుకుంటారు. అందుకే ఈ సారి సినిమా వాళ్లకు పదవులు ఇవ్వడం కష్టమేనంటున్నాయి టీడీపీ వర్గాలు. పైగా తెలంగాణ, తమిళనాడు, ఉత్తరభారతానికి చెందిన వారిని కూడా అకామిడేట్ చేయాలి. తమిళనాడులో నివసిస్తున్న తెలుగు మూలాలకు చెందిన ఓ వ్యక్తికి ఆల్‌రెడీ మాట ఇచ్చేసి ఉన్నారట! మొత్తంమీద ఈసారి టాలీవుడ్ వారికి టీటీడీ మెంబరయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.