జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై(Pawan Kalyan) జగన్(Jagan) ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్ధిలేని చర్య అని టీడీపీ(TDP) అధ్య‌క్షుడు చంద్రబాబు(Chandra babu) మండిప‌డ్డారు. వైసీపీ(YCP) ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల(Volunteers) ద్వారా సేకరించడాన్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా అని ప్ర‌శ్నించారు

జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై(Pawan Kalyan) జగన్(Jagan) ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్ధిలేని చర్య అని టీడీపీ(TDP) అధ్య‌క్షుడు చంద్రబాబు(Chandra babu) మండిప‌డ్డారు. వైసీపీ(YCP) ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల(Volunteers) ద్వారా సేకరించడాన్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని, ఈ అణచివేత ధోరణి మానుకోవాలని సూచించారు. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలన్నారు.

ప్రజల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పని చంద్రబాబు అన్నారు. తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు.. రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యిందని ఆక్షేపించారు. నాలుగేళ్ల వైసీపీ దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయని అన్నారు. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి, రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

Updated On 21 July 2023 7:07 AM GMT
Ehatv

Ehatv

Next Story