ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల(Infra structure companies) నుంచి పొందిన రూ.118 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని కలిగి ఉన్నందుకు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నోటీసులపై చంద్రబాబు నాయుడు(chandrababu naidu) ఇంకా స్పందించాల్సివుంది.

Bonda Uma
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల(Infra structure companies) నుంచి పొందిన రూ.118 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని కలిగి ఉన్నందుకు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నోటీసులపై చంద్రబాబు నాయుడు(chandrababu naidu) ఇంకా స్పందించాల్సివుంది. ఐటీ నోటీసులపై(IT Notice) వైసీపీ నేతలు(YCP Leaders).. టీడీపీ(TDP) హాయాంలో జరిగిన ఈ అవినీతిపై చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టీడీపీ పోలిట్ బ్యూరో(TDP Polit Bureau) మెంబర్ బోండా ఉమా(Bonda Uma) స్పందిస్తూ.. ఐటీ నోటీసులపై వైసీపీ నేతలు శునాకానదం పొందుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు నీతి నిజాయితీపై వైసీపీ ప్రభుత్వం బురదజల్లుతుందని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు ట్రాన్సాక్షన్ జరగని ఈ కేసులో ఐటీ ఇచ్చిన నోటీసులకు చట్టబద్దత, విలువ లేదని అన్నారు. ఐటీ ఇచ్చిన నోటీసుల వెనుక వైసీపీ లాబీయింగ్ చేసిందని ఆరోపించారు. చంద్రబాబు ఇమేజ్‌ని తగ్గించాలని చూస్తున్నారని ఆరోపించారు. డబ్బు ఎక్కడా చేతులు మారనప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చే అవసరం ఏముందని ప్రశ్నించారు.
