TDP Payyavula Keshav : అడ్డంగా బుక్కైన టీడీపీ, బయటపడ్డ పయ్యావుల కేశవ్ వీడియో.
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడుది(Nara Chandrababu naidu) రెండు కళ్ల సిద్ధాంతం. ఇక్కడో మాట, అక్కడో మాట చెప్పడం ఆయనకు ఆది నుంచి అలవాటే! అలాగే నాలక మడతేయడంలో కూడా ఆయన సిద్ధహస్తుడు. ఇందుకు ఉదాహరణలు ఇవ్వాలంటే పెద్ద ఉద్గంధ్రమే అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల(AP Elections) సమయంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానం అత్యంత హేయంగా ఉంది. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండగట్టవచ్చు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబుతూ ఓట్లు అడగవచ్చు. కానీ అవాస్తవాలు చెబుతూ ఓట్లు అడుక్కోవడమే నీచాతి నీచం.

TDP Payyavula Keshav
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడుది(Nara Chandrababu naidu) రెండు కళ్ల సిద్ధాంతం. ఇక్కడో మాట, అక్కడో మాట చెప్పడం ఆయనకు ఆది నుంచి అలవాటే! అలాగే నాలక మడతేయడంలో కూడా ఆయన సిద్ధహస్తుడు. ఇందుకు ఉదాహరణలు ఇవ్వాలంటే పెద్ద ఉద్గంధ్రమే అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల(AP Elections) సమయంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానం అత్యంత హేయంగా ఉంది. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండగట్టవచ్చు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబుతూ ఓట్లు అడగవచ్చు. కానీ అవాస్తవాలు చెబుతూ ఓట్లు అడుక్కోవడమే నీచాతి నీచం. దుష్ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవడం దారుణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై కూడా చంద్రబాబు రెండు నాలుకల ధోరణిని వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ చట్టానికి అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలిపి సంపూర్ణ మద్దతును ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు బుదర చల్లుతుండటం ఆయనకే చెల్లుతుంది.
పైగా ల్యాండ్ టైట్లింగ్(Land Titiling) బిల్లును ఆకాశానికెత్తారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలులోకి వస్తే ప్రజల భూములన్నీ మాయమవుతాయని, జగన్ దోచుకుంటారని చెబుతున్న అబద్దాలను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. బహుశా దేశంలో మరే ఇతర రాజకీయనాయకుడు కూడా చంద్రబాబులా మాట మార్చరేమో! అప్పట్లో నిండు అసెంబ్లీలో టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్(CM Jagan) 2019 జులై జరిగిన అసెంబ్లీ సమావేశంలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లును ప్రవేశపెట్టారు. అదే ఏడాది జులై 29న దీనిపై సభలో చర్చ జరిగింది. అప్పుడు టీడీపీ తరఫున పయ్యావుల కేశవులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ఇంత గొప్ప బిల్లు లేనే లేదని కితాబులిచ్చారు. తనకు తోచిన సూచనలు కూడా చేశారు. ఆనాడు శాసనసభలో పయ్యావుల కేశవులు ఏమన్నారంటే ' ఈ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్లే బిల్లు. బిల్లుని మేం ఆమోదిస్తున్నాం. మంత్రిగారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.
ఇవాళ భూములు కొనాలంటే భయపడే పరిస్థితులున్నాయి. అది నిజమైన టైటిలా? వివాదాస్పద టైటిలా? అనేది తెలియడంలేదు. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ల్యాండ్ టైటిల్ క్లియర్‌గా లేకుంటే సమస్య అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ స్కీమ్ ప్రారంభించి రాష్ట్రాలన్నీ అమలు చేయాలని కోరింది. కర్నాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్టు అమల్లో ఉంది. ఈ ప్రాజెక్టు మన దేశానికి కొత్త కావచ్చు కానీ 1858లోనే ఆస్ట్రేలియాలో ఉంది. టోరెన్స్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైట్లింగ్ అనే విధానం.. అంటే టైటిల్‌కి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఆ తర్వాత చాలా దేశాలు దీన్ని అమలు చేశాయి. రాజస్థాన్–2016లోనే దాదాపు ఇలాంటి చట్టాన్నే పాస్ చేసింది. కానీ ప్రాక్టికల్‌గా అమల్లోకి వెళ్లినట్లు కనపడలేదు. ఆశయాలు మాత్రం చాలా గొప్పవి. ఆచరణలో ఈ ప్రభుత్వమే కాదు.. ఎవరు చేపట్టినా చాలా సమస్యలతో కూడుకున్నది ఇది. చిక్కులను తొలగించేందుకు ఈ ప్రభుత్వానికి చాలా టైమ్ పడుతుంది.
దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇది రెండేళ్లలో అవుతుందా? నాలుగేళ్లు పడుతుందా? ఐదేళ్లు పడుతుందా? అనేది పక్కన పెడితే తప్పకుండా ఇదొక పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్లే బిల్లు అవుతుంది. ల్యాండ్ టైట్లింగ్‌కంటే ముందు సర్వే చేయాలి. సర్వే కూడా ప్రభుత్వం పెద్దఎత్తున చేసే ఆలోచనలో ఉందని తెలిసింది. చాలా బృహత్తర కసరత్తు. 1900 సంవత్సరంలో ల్యాండ్ సర్వే డిపార్టుమెంట్ ఏర్పడితే 1970కి గానీ మనకి అప్‌డేటెడ్ రికార్డులు రాలేదు. మనం రెండేళ్లలో చేస్తామంటున్నాం. టెక్నాలజీ, మ్యాన్ పవర్ ఉన్నా ఇదొక సాహసోపేతమైన చర్య. సరిగ్గా చేయకపోతే ఇదొక దుస్సాహసం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రజలకు భూమి మీద ఉన్న మమకారం చాలా గొప్పది. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నాకు తెలిసి రూ.1500 కోట్లు అవసరమయ్యే ప్రాజెక్టు ఇది. ప్రభుత్వంలో ఎవరున్నా రీ సర్వే 40 ఏళ్లకు ఒకసారి నిర్వహించాలి. ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే చర్య' అని ఆనాడు విస్పష్టంగా పయ్యావుల కేశవులు అన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే తెలుగుదేశంపార్టీ నేతలు బిక్కచచ్చిపోతున్నారు. తెలుగుదేశంపార్టీ వైఖరి ఏమిటో జనాలకు తెలిసిపోయింది. తెలుగుదేశం నేతలకు ఏమాత్రం ఇంగితం ఉన్నా, ఏమాత్రం జ్ఞానం ఉన్నా, తాము అసత్య ప్రచారం చేశామని చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ అడగాలి.
