ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Elections 2023) సమయం దగ్గరపడింది. మరికొన్ని వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీకి సంబంధించిన విధానాలను ప్రశ్నించడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న చెప్పే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Elections 2024) సమయం దగ్గరపడింది. మరికొన్ని వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీకి సంబంధించిన విధానాలను ప్రశ్నించడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న చెప్పే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉంటాయి. అధికారపార్టీకి ఈ అవకాశం ఉండదు. ఇచ్చిన హామీలను నెరవేర్చామా లేదా అన్నది మాత్రమే చెప్పుకునే వీలుంటుంది. కొత్తగా మళ్లీ ఇది చేస్తామని చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఏపీలో ఉన్న అధికార పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) ఏం చెబుతున్నదంటే తాము ఇచ్చిన హామీలలో 90 శాతం నెరవేర్చామని, మా ద్వారా లబ్ధి పొందితేనే, మా ద్వారా సంక్షేమం చేతికందితేనే మాకు ఓటేయండి అని అంటోంది. మా ద్వారా లబ్ధి పొందలేకపోయి ఉంటే మాకు ఓటు వేయకండి అని ధైర్యంగా ప్రచారం చేసుకుంటోంది. అధికారపార్టీని కౌంటర్ చేయడానికి తెలుగుదేశంపార్టీ కూడా కొన్ని హామీలు ఇచ్చింది. కొన్ని రోజుల పాటు టీడీపీ ఇచ్చిన హామీలపై చర్చ జరిగింది. మళ్లీ ఏమైందో ఏమో ఇప్పుడు హామీల ప్రస్తావనే ఉండటం లేదు.