TDP Media Articles : అదేమిటి? వేర్వేరు స్క్రిప్టులు పంపారా?
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తెలుగుదేశంపార్టీకి(TDP) కొమ్ముకాస్తున్న రెండు ప్రధాన పత్రికలు ఈనాడు(Enadu), ఆంధ్రజ్యోతిలు(ABN) ఈరోజు ఓ వింత ధోరణిని ప్రదర్శించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు(AP Police) అధికారులంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఏజెంట్లుగా మారిపోయారని, వైసీపీ కండువాలు వేసుకుంటూ పనులు చేస్తున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. చాలా కాలంగా ఇదే పని చేసుకుంటూ వస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తెలుగుదేశంపార్టీకి(TDP) కొమ్ముకాస్తున్న రెండు ప్రధాన పత్రికలు ఈనాడు(Enadu), ఆంధ్రజ్యోతిలు(ABN) ఈరోజు ఓ వింత ధోరణిని ప్రదర్శించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు(AP Police) అధికారులంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఏజెంట్లుగా మారిపోయారని, వైసీపీ కండువాలు వేసుకుంటూ పనులు చేస్తున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. చాలా కాలంగా ఇదే పని చేసుకుంటూ వస్తున్నది. తెలుగుదేశంపార్టీ మీడియా చెప్పినట్టుగా ఎన్నికల కమిషన్ యాక్ట్ చేస్తున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వైసీపీకి చెందిన మంత్రి పేర్ని నాని(Perni Nani) భాషలో చెప్పాలంటే ఈనాడు ఏం చెబితే ఈసీ(Election Commission) అదే చేస్తున్నది. జిల్లాల ఎస్పీలను మార్చారు కాబట్టి ఈ చర్య తమకు వ్యతిరేకమైనదేనని వైసీపీ భావిస్తోంది. ఇక్కడ రాజకీయపార్టీల ఎజెండాల కంటే పత్రికల ఎజెండాలే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కొత్త ఎస్పీల నియామకాలపై ఇవాళ ఈనాడు రాసిన రాతలను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. వీళ్లా కొత్త ఎస్పీలు ? అనే హెడ్‌లైన్‌తో, సగానికి పైగా వైకాపా విధేయులే! అనే సబ్ హెడింగ్‌తో పెద్ద కథనమే రాసింది. అయిదుగురు ఎస్పీలను, ముగ్గురు ఐఎఎస్ అధికారులను ఎన్నికల సంఘం తొలగించినప్పుడు ఈసీ ఈడ్చికొట్టింది అని ఈ పత్రికే రాసింది. అంటే వైసీపీకి అనుకూలంగా ఉంటే ఈడ్చికొట్టింది అని రాశారు అదే కొత్త ఎస్పీలు వస్తే.. వీళ్లా కొత్త ఎస్పీలు అని రాశారు. అధికారపార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణచివేసిన చరిత్ర వారిది.. ఇలా ఏమోమో రాసుకుంటూ వచ్చింది ఈనాడు.. అసలు ఆ పత్రిక ఉద్దేశమేమిటో, ఎందుకు అలా రాసిందో ఈ వీడియోలో చూద్దాం.