చంద్ర‌బాబు అరెస్ట్‌ను వ్య‌తిరేకిస్తూ గాంధీ జయంతి రోజున టీడీపీ నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. సత్యమేవ జయతే పేరుతో ఒక రోజు నిరాహార దీక్షలకు టీడీపీ సిద్ధమయ్యింది.

చంద్ర‌బాబు అరెస్ట్‌(Chandrababu Arrest)ను వ్య‌తిరేకిస్తూ గాంధీ జయంతి(Gandhi Jayanthi) రోజున టీడీపీ(TDP) నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. సత్యమేవ జయతే పేరుతో ఒక రోజు నిరాహార దీక్షలకు టీడీపీ సిద్ధమయ్యింది. ఈ మేర‌కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atcham Naidu) ఆదివారం ఓ ప్రకటన చేశారు. రాజమండ్రి(Rajahmundry) కేంద్ర కారాగారంలో పార్టీ అధినేత చంద్రబాబు నిరాహార దీక్ష చేయ‌నున్నార‌ని తెలిపారు. చంద్ర‌బాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) కూడా రాజమహేంద్రవరంలో నిరాహార దీక్ష చేపడతారని వెల్ల‌డించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) ఢిల్లీ(Delhi)లో నిరాహార దీక్ష చేయనున్నారు. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌(Kanakamedal Ravindrakumar) నివాసంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే దీక్షలో టీడీపీ ఎంపీలు పాల్గొంటారని లోకేశ్‌ తెలిపారు. ఈ దీక్షలకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు మహాత్మాగాంధీకి నివాళులర్పించి, నిరాహార దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరాహార దీక్షల్లో పెద్ద ఎత్తున పాల్గొవాల‌ని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Updated On 1 Oct 2023 10:28 PM GMT
Yagnik

Yagnik

Next Story