TDP NRI's : ఏపీలో ఓట్లు కొనేందుకు టీడీపీ ప్లాన్, రంగంలోకి దిగిన ఎన్ఆర్ఐలు !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(AP assembly Elections) ఎన్ని కుట్రలైనా చేసి, ఎన్ని కుయుక్తులైనా పన్ని, ఎన్ని కుతంత్రాలకైనా పాల్పడి విజయం సాధించాలన్నది తెలుగుదేశం పార్టీ(TDP) టార్గెట్! తమ కులపోడు అధికారంలోకి రావాలనే కోరిక కమ్మ సామాజికవర్గానికి బాగా ఉంది. అందుకే ఓ దరిద్రపు ఆలోచన చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(AP assembly Elections) ఎన్ని కుట్రలైనా చేసి, ఎన్ని కుయుక్తులైనా పన్ని, ఎన్ని కుతంత్రాలకైనా పాల్పడి విజయం సాధించాలన్నది తెలుగుదేశం పార్టీ(TDP) టార్గెట్! తమ కులపోడు అధికారంలోకి రావాలనే కోరిక కమ్మ సామాజికవర్గానికి బాగా ఉంది. అందుకే ఓ దరిద్రపు ఆలోచన చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఊళ్లల్లో ఓట్లను కొనేందుకు భారీ కుట్రక తెరలేపింది. ఇందుకోసం టీడీపీ ఎన్‌ఆర్‌ఐ(TDP NRI) విభాగం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) విజయం సాధిస్తుందనే సంకేతాలు వస్తుండటంతో టీడీపీ అధినాయకత్వానికి నిద్రపట్టడం లేదు. సర్వే ఫలితాలన్నీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పక్షానే ఉంటుండటంతో టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది. టీడీపీ అనుకూల మీడియా ఎన్ని కట్టుకథలు రాసినా, జగన్ వ్యక్తిత్వహననానికి పాల్పుడుతున్నా జనం లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం రంగంలోకి దిగింది. పల్లెల్లో ఓట్లను కొనేందుకు సిద్ధయ్యింది. లేటెస్ట్‌గా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో-ఆర్డినేటర్ కోమటి జయరాం ఓటర్లకు డబ్బులు ఎలా పంచాలో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది కానీ లేకపోతే తమంత సుద్దిపూసలు మరొకరు ఉండరనే బిల్డప్ ఇచ్చుకునేవారు టీడీపీ నేతలు! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల కుటుంబాలకు మూడు, నాలుగు లక్షలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని కోమటి జయరాం చెప్పారు. మనకు రెండు మూడు లక్షలు ఖర్చు చేయడం పెద్ద కష్టమైన పనేం కాదన్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం వెయ్యి ఓట్లను కొనడానికి పథకాన్ని ఆయన రచించారు. వైఎస్ జగన్‌ను అభిమానించే కుటుంబాలను వెధవలు అంటూ నీచంగా మాట్లాడారు కోమటి జయరాం!