ఎన్నికలొచ్చిన ప్రతిసారి తిరుపతి అసెంబ్లీ(Tirupati) సెగ్మెంట్ చుట్టూ పెద్ద చర్చ ఉంటుంది. తిరుపతి అసెంబ్లీకి ఎవరు పోటీ చేస్తున్నారు? ఏంటనేదానిపైనా సహజంగానే అందరిలో ఆసక్తి ఉంటుంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మళ్లీ చర్చ మొదలైంది. గతంలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్(NTR), ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేశారు. ఈసారి పవన్ కల్యాణ్(Pawan kalyan) కూడా పోటీ చేస్తారని చర్చ ఉంది.
ఎన్నికలొచ్చిన ప్రతిసారి తిరుపతి అసెంబ్లీ(Tirupati) సెగ్మెంట్ చుట్టూ పెద్ద చర్చ ఉంటుంది. తిరుపతి అసెంబ్లీకి ఎవరు పోటీ చేస్తున్నారు? ఏంటనేదానిపైనా సహజంగానే అందరిలో ఆసక్తి ఉంటుంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మళ్లీ చర్చ మొదలైంది. గతంలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్(NTR), ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేశారు. ఈసారి పవన్ కల్యాణ్(Pawan kalyan) కూడా పోటీ చేస్తారని చర్చ ఉంది. దీంతో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పై అందరి దృష్టి పడింది. ప్రస్తుత తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar reddy) ఉన్పప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో భూమన కరుణాకర్‌రెడ్డి తనయుడు భూమన అభినయ్‌రెడ్డి(Abhinay reddy) పోటీ చేస్తారనే వైసీసీ అధిష్టానం ప్రకటించింది. కానీ..తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో బీసీల ఓటు బ్యాంకు ఎక్కువ. ఇక్కడ బలిజ, యాదవ సామాజికవర్గాల ఓట్లు అధికంగా ఉంటాయి. ఈసారి టీడీపీ బీసీ అభ్యర్థిని బరిలోకి దించొచ్చనే చర్చ మొదలైంది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే..పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఒకవేళ పవన్ కాదంటే.. బలిజ సామాజికవర్గానికి చెందినవాళ్లు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ తిరుపతిలో ఒక సర్వే చేపట్టింది. ముఖ్యంగా నలుగురు అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ చేసింది. కానీ..ఆ నలుగురిలో యాదవ సామాజికవర్గం నుంచి ఒక్కరు కూడా లేరు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న తమను టీడీపీ నిర్లక్ష్యం చేస్తోంది, అవమానిస్తోంది..అంటూ యాదవ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది. కేవలం ఒక సామాజికవర్గానికి చెందిన నలుగురిపైనే సర్వే నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఈ వీడియలో చూద్దాం.