TDP Next Target Kodali Nani? : నెక్స్ట్ టార్గెట్ గుడివాడనేనా..!
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ అరెస్టయిన సంగతి తెల్సిందే.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ అరెస్టయిన సంగతి తెల్సిందే. రెడ్‌బుక్‌లో మొదటి పేర్లలో కొడాలినాని, వంశీ ఉంటాయి. వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. దీంతో ఇక చర్చంతా కొడాలి నానిపై పడింది. ఈ నేపథ్యంలో తర్వాత అరెస్ట్ వంతు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌లపై కొడాలి దారుణంగా విమర్శించారని టీడీపీ ఆగ్రహంగా ఉంది. తాము రెడ్‌బుక్(Red book)లో రాసుకుంటున్నామని అధికారంలోకి వస్తే కొడాలి నానితో పాటు పలువురి అంతు చూస్తామని లోకేష్ (nara lokesh)బహిరంగంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య అమెరికా పర్యటనలో కూడా లోకేష్ త్వరలోనే రెడ్‌బుక్ పార్ట్-3 చూస్తారని చెప్పారు. పార్ట్-3 భాగంగానే వంశీ అరెస్ట్ అయినట్లుగా భావించొచ్చు. రానున్న రోజుల్లో కొడాలి నానిని కూడా ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పాలకులు అనుకుంటే, ఏదో ఒక కేసును సృష్టించడం పెద్ద పనేమీ కాదని పలువురు అంటున్నారు. కొడాలి నాని కూడా ఎక్కవగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. గుడివాడలో పెద్దగా కనిపించడంలేదు. ఎలాగైనా ఏదో ఒక కేసులో నానిని ఇరికించాలని టీడీపీ చూస్తోంది. వంశీ అరెస్ట్ నేపథ్యంలో నెక్స్ట్ కొడాలి నానీదే అరెస్ట్ అని అందరూ చర్చించుకుంటున్నారు.
