కోరి వచ్చిన మహత్తరమైన పదవిని వద్దనేశారు తెలుగుదేశంపార్టీకి(TDP) చెందిన నెల్లూరు(Nelluru) ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(MP Vemireddy Prabhakar Reddy).

కోరి వచ్చిన మహత్తరమైన పదవిని వద్దనేశారు తెలుగుదేశంపార్టీకి(TDP) చెందిన నెల్లూరు(Nelluru) ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(MP Vemireddy Prabhakar Reddy). అదేం మామూలు పదవి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌(TTD Chairperson) పదవి! ఆ పదవి కోసం పైరవీలు చేసుకుంటారు. చొక్కాలు చించుకుంటారు. ఆ పదవి వస్తే జీవితం ధన్యమైనట్టుగా భావిస్తారు. అలాంటి పదవి వరించి వస్తే సున్నితంగా తిరస్కరించేశారు వేమిరెడ్డి. ఈయనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నిర్ణయించారట! నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) తుడిచిపెట్టుకుపోవడానికి వేమిరెడ్డినే కారణమన్నది చంద్రబాబు భావన! ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చి టీడీపీలో చేరారు వేమిరెడ్డి దంపతులు. నెల్లూరు లోక్‌సభ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తే, కోవూరు అసెంబ్లీ నుంచి ఆయన భార్య ప్రశాంతి రెడ్డి(Prashanthi reddy) నిల్చున్నారు. వేమిరెడ్డి ఆస్తిపరుడే కాదు, చుట్టుపక్కల ఆయనకు మంచి పేరు ఉంది. ప్రజలలో అభిమానం ఉంది. అలాంటి వేమిరెడ్డిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చేజేతులా వదిలేసుకుంది. వేమిరెడ్డిని బలవంతంగా పార్టీ నుంచి పంపించేశారన్న ఆవేదన ఆయన సామాజికవర్గంలో కూడా ఉండింది. ఇవన్నీ నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడానికి కారణాలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి విజయంలో ప్రధానపాత్ర పోషించిన వేమిరెడ్డికి టీడీపీ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలనుకున్నారు చంద్రబాబు. ఈ విషయాన్ని వేమిరెడ్డికి చెప్పారు. నిజానికి ఈ మాట విన్నాక ఎవరైనా ఎగిరి గంతేస్తారు. సంబరపడతారు. కానీ వేమిరెడ్డి మాత్రం ఆ పదవిని కాదన్నారు. తనకు ఉన్న వ్యాపారాలతో సదా బిజీగా ఉంటానని, టీటీడీ ఛైర్మన్‌ పదవికి న్యాయం చేయలేనని చెప్పారట! వేమిరెడ్డి ఈ మాట అంటారని చంద్రబాబు ఊహించి ఉండరు. అందుకే ఆయన ఆశ్చర్యపోయారట! టీడీపీ నుంచి తాను ఎలాంటి పదవులను ఆశించడం లేదని, తగిన గౌరవం ఇస్తే చాలని వేమిరెడ్డి అన్నారట!

Eha Tv

Eha Tv

Next Story