Nara Lokesh CID Investigation : రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన నారా లోకేశ్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(Inner Ring Road Case) కేసులో టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) రెండో రోజు సీఐడీ(CID) విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో లోకేష్ విచారణ ప్రారంభమయింది. మంగళవారం లోకేశ్ ను సుమారు ఆరున్నర గంటల సేపు సీఐడీ అధికారులు విచారించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(Inner Ring Road Case) కేసులో టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) రెండో రోజు సీఐడీ(CID) విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో లోకేష్ విచారణ ప్రారంభమయింది. మంగళవారం లోకేశ్ ను సుమారు ఆరున్నర గంటల సేపు సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన లోకేష్.. రోజంతా వేస్ట్ చేశారని సీఐడీ విచారణపై కామెంట్ చేశారు. మొత్తం 50 ప్రశ్నలను అడిగారని.. వాటిలో 49 ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేనివేనని ఎద్దేవా చేశారు. రింగ్ రోడ్డు వ్యవహారంతో సంబంధం లేని ప్రశ్నలను అడిగి.. టైం వేస్ట్ చేశారంటూ లోకేష్ కామెంట్స్ చేశారు.
మంత్రినయ్యాక భూముల లే అవుట్ పై ఇచ్చిన ఓ జీవో గురించి తప్ప ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ప్రశ్నలు అడగలేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో మేం అవినీతికి పాల్పడ్డామని గానీ, మా కుటుంబం లబ్ది పొందిందని గానీ ఎలాంటి ఆధారాలను సీఐడీ వాళ్లు నా ముందు పెట్టలేదని లోకేశ్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయని దర్యాప్తు అధికారి నాతో చెప్పారు. రేపు నేను చాలా బిజీ.. ఆ ప్రశ్నలేవో ఇప్పుడే అడగండి.. ఎంత సమయం అయినా ఉంటాను అని బదులిచ్చానని.. కానీ సీఐడీ అధికారులు అందుకు అంగీకరించకుండా.. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ అక్కడిక్కడే నోటీసులు ఇచ్చారని లోకేశ్ పేర్కొన్నారు.