బాప్‌ ఏక్‌ నంబరీ, బేటా దస్‌ నంబరీ అని ఇలాంటి తండ్రి కొడుకులను చూసే అనుంటారు. ఆ తండ్రి కొడుకులు ఎవరంటే నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu), నారా లోకేశ్‌(Nara Lokesh). తండ్రి నోటి వెంట ఎప్పుడూ నేను, నేనే, నాతోనే, నావల్లే అంటూ విభక్తులు వస్తుంటాయి కదా! ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా అది నావల్లే అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటుంటారు కదా! ఇప్పుడు ఆయన నోట్లోంచి ఊడిపడ్డారు లోకేశ్‌బాబు.

బాప్‌ ఏక్‌ నంబరీ, బేటా దస్‌ నంబరీ అని ఇలాంటి తండ్రి కొడుకులను చూసే అనుంటారు. ఆ తండ్రి కొడుకులు ఎవరంటే నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu), నారా లోకేశ్‌(Nara Lokesh). తండ్రి నోటి వెంట ఎప్పుడూ నేను, నేనే, నాతోనే, నావల్లే అంటూ విభక్తులు వస్తుంటాయి కదా! ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా అది నావల్లే అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటుంటారు కదా! ఇప్పుడు ఆయన నోట్లోంచి ఊడిపడ్డారు లోకేశ్‌బాబు. ఎంతైనా చంద్రబాబు కొడుకే కదా! ఈ దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది వాళ్ల తాతగారు ఎన్‌.టి.రామారావు(Sr.NTR) అట! తనకున్న ఈ జ్ఞానాన్ని పది మందికి చెప్పే ప్రయత్నం చేశారు లోకేశ్‌. అసలు లోకేశ్‌ రాజకీయ పరిజ్ఞానం ఎంత? ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు లోకేశ్‌ వయసు పట్టుమని పన్నెండేళ్లు ఉంటాయంతే! అప్పుడాయనకు ఎన్టీఆర్‌ పాలన గురించి తెలుస్తుందని మాత్రం అనుకోలేం.

పోనీ పుస్తకాలు గట్రాలు చదివి తెలుసుకున్నారా అంటే ఆ జ్ఞానమంతా టీడీపీ(TDP) అనుకూల మీడియా రాసిన రాతల నుంచే వచ్చిందనుకోవచ్చు. దేశంలో సంక్షేమ పథకాలను, సంస్కరణలను తీసుకొచ్చిందెవరో తెలుసుకోకుండా తమ తాతగారేనని లోకేశ్‌ చెప్పడమే నవ్వు తెప్పిస్తోంది. బహుశా ఆయన ఇందిరాగాంధీ(Indira Gandi) పాలనను చూసి ఉండరు. బ్యాంకులను జాతీయకరణం చేసింది, రాజభరణాలను రద్దు చేసింది ఇందిరా అని లోకేశ్‌కు తెలియదా? పోనీ ఆయన ఉద్దేశంలో సంక్షేమం అంటే రెండు రూపాయలకు కిలో బియ్యం, మధ్యాహ్నం భోజన పథకం అనుకుందాం! ఈ రెండు పథకాలు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాక మునుపే తమిళనాడులో అమలవుతున్నాయి. తమిళనాడును పాలించిన కామరాజ్‌ నుంచి మొదలుపెడితే ఎంజీఆర్‌(MGR) వరకు అందరూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. మధ్యాహ్న భోజన పథకం కామరాజ్‌ది! తమిళనాడులో స్కూల్‌ పిల్లలకు పళ్లపొడి పథకం దగ్గర నుంచి వారికి కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఇచ్చింది ఎంజీఆర్‌. ఎన్టీఆర్‌ కుర్ర హీరోయిన్లతో సినిమాల్లో గెంతుతున్నప్పుడే దేశంలో చాలా చోట్ల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇది లోకేశ్‌ తెలుసుకుంటే మంచిది.

Updated On 19 Feb 2024 6:40 AM GMT
Ehatv

Ehatv

Next Story