Nara Lokesh : దసరా రోజున మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన లోకేష్
చంద్రబాబు అరెస్ట్‌కు(Chandra Babu) నిరసనగా టీడీపీ(TDP) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం' పేరిట ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) నిరసనకు పిలుపునిచ్చారు.

Nara Lokesh
చంద్రబాబు అరెస్ట్‌కు(Chandra Babu) నిరసనగా టీడీపీ(TDP) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం' పేరిట ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) నిరసనకు పిలుపునిచ్చారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దాం అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా.. అక్టోబర్ 23 విజయదశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వచ్చి "సైకో పోవాలి" అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయండని లోకేష్ పిలుపునిచ్చారు. నిరసనలకు సంబంధించిన వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయండని సూచించారు. సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా పండగని సెలబ్రేట్ చేసుకుందామని ట్విటర్ ద్వారా నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
