వెండితెరను శాసించిన తారలకు, సరికొత్త చరిత్రను సృష్టించిన క్రీడాకారులకు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు ఉంటుంది. ఎల్లకాలమూ తమ హవానే కొనసాగాలంటే కుదరదు. గౌరవప్రదంగా తప్పుకోవాలి. లేదంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. గౌరవప్రదంగా తప్పుకోవాలే కానీ, గెంటించుకోకూడదు. రాజకీయాల్లోనూ అంతే! ప్రజల అభిమానం ఉన్నప్పుడే రిటైరవ్వాలి. నాయకులు అదే కోరుకుంటారు.

వెండితెరను శాసించిన తారలకు, సరికొత్త చరిత్రను సృష్టించిన క్రీడాకారులకు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు ఉంటుంది. ఎల్లకాలమూ తమ హవానే కొనసాగాలంటే కుదరదు. గౌరవప్రదంగా తప్పుకోవాలి. లేదంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. గౌరవప్రదంగా తప్పుకోవాలే కానీ, గెంటించుకోకూడదు. రాజకీయాల్లోనూ అంతే! ప్రజల అభిమానం ఉన్నప్పుడే రిటైరవ్వాలి. నాయకులు అదే కోరుకుంటారు. ప్రజలతో ఛీత్కారాలను, తిరస్కారాలను, వ్యతిరేకతను మూటగట్టుకున్న తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతుంటారు కొందరు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడునే(Chandrababu) తీసుకోండి.

అప్పుడెప్పుడే చక్రం తిప్పాను, ప్రధానమంత్రులను నియమించాను, రాష్ట్రపతులను ఎంపిక చేశాను, సెల్‌ఫోన్‌ను కనిపెట్టాను, సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లడం నేర్పించాను, నా వల్లే తెలుగువారికి ఇంగ్లీషు వచ్చింది, నా వల్లే సత్య నాదెళ్లకు ఆ పోజిషన్‌ వచ్చింది, నా వల్లే సింధు ఒలింపిక్స్‌ మెడల్‌ గెల్చుకుంది అని ఇప్పుడు చెబితే కుదరదు. రాజకీయాలలో నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉందాయనకు! పద్నాగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు కూడా! ఇప్పుడాయనకు 75 ఏళ్లు. చేసింది చెప్పుకుంటూ హాయిగా ఇంటిపట్టున ఉండవచ్చు. కానీ చంద్రబాబుకు అధికారం మీద ఆశలింకా చావలేదు. అధికారాన్ని దక్కించుకోవడానికి ఆయన ఏమైనా చేస్తారు. ఎంతకైనా దిగజారుతారు. ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటారు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి చంద్రబాబుతోనే పుట్టిందేమో!ఆయన ఇవాళ దోస్తానా చేస్తారు. రేపు బండబూతులు తిడతారు. చంద్రబాబు ఏం చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని సమర్థిస్తూ రాతలు రాసే టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడూ అదే పని చేస్తున్నది.

బీజేపీ పొత్తు కోసం చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు బీజేపీని(BJP), ఆ పార్టీ అధినేతలను ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. భార్యను వదిలేసినవాడు ప్రజల బాగోగులేం చూస్తాడని మోదీని దూషించారు. అమిత్ షాపై రాళ్లేయించారు. బాలకృష్ణతో వచ్చిరాని హిందీలో తిట్టించారు. ఇప్పుడు అదే మోదీని ఇంద్రుడు చంద్రుడు అని కీర్తిస్తున్నాడు. బాబ్బాబు మాతో పొత్తుపెట్టుకోండంటూ బతిమాలుతున్నారు. పొత్తుల విషయం తేల్చడానికే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని ఓ వర్గం మీడియా రాసుకొచ్చింది. బీజేపీ నాయకత్వం పిలిస్తేనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని, ఎన్డీయే(NDA) బలోపేతానికి మీరు మాకు సపోర్ట్‌ చేయాల్సిందేనని అమిత్‌ షా(Amit shah) వేడుకున్నారని ఇంకా చాలా చాలా రాసుకొచ్చింది. అధికారం కోసం చంద్రబాబు పడుతున్న పాట్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. పొత్తు కోసం చంద్రబాబు ఏకంగా అమిత్‌ షా కాళ్లు పట్టుకున్నాడంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. అమిత్‌షా కాళ్లు మొక్కుతున్న ఫోటో కూడా వైరల్‌ అయ్యింది. ఈ కాళ్లు పట్టుకునే ఈ ఫోటో ఫేక్‌ అయి ఉంటుంది కానీ కాళ్లా వేళ్లా పడ్డారని అంటున్నారు. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందుకోసం ఎవరితోనైనా జత కట్టగలరు. పవన్‌ కల్యాణ్‌ను మచ్చిక చేసుకున్నది అందుకే. ఇప్పుడు మోదీ, అమిత్‌ షాలను వేడుకుంటున్నది కూడా అందుకే! ఇంతమంది వెంటనిలిచినా మళ్లీ పరాజయపాలైతే మాత్రం చంద్రబాబుకు అంతకు మించిన అవమానం మరోటి ఉండదు.

Updated On 8 Feb 2024 5:45 AM GMT
Ehatv

Ehatv

Next Story