TDP Leaders Arrested in Palasa : పలాసలో అర్ధరాత్రి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అరెస్ట్
పలాస పట్టణంలో అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట టీడీపీ నేతలపై వేధింపులకు దిగుతున్నారంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌లు ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పలాస(Palasa) పట్టణంలో అర్ధరాత్రి(Midnight) ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట టీడీపీ(TDP) నేతలపై వేధింపులకు దిగుతున్నారంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu), ఎమ్మెల్యే అశోక్(MLA Ashok)లు ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. వివరాళ్లోకెళితే.. పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు నాగరాజు(Nagaraju) తన ఇంటికి వెళ్లే దారిలో ఉన్న సాగునీటి కాలువపై పదిహేనేళ్ల క్రితం కల్వర్టు నిర్మించుకున్నారు. ఈ కల్వర్టు అక్రమ నిర్మాణమంటూ ఇటీవల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందంటూ కల్వర్టు తొలగించేందుకు సిద్ధమయ్యారు. శనివారం అర్ధరాత్రి కూల్చివేత సామాగ్రితో కల్వర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో, అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నాగరాజును ఇబ్బంది పెట్టడానికే కల్వర్టు కూల్చేందుకు రెడీ అయ్యారని టీడీపీ నేతలు ఆరోపించారు. నాగరాజుకు మద్దతుగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష(Shirisha)తో పాటూ పలువురు టీడీపీ నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అధికారులు, టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ నాయకులను అరెస్ట్(Arrest) చేసి పోలీస్ స్టేషన్(Police Station)కు తరలించారు.