Buddha Venkanna : జగన్ పులివెందుల పులి కాదు.. సునీతా రెడ్డి పులివెందుల పులి
ఎన్ఎస్‌జీ కమెండోలు(NSG Commandos) లేకుండా చంద్రబాబు(Chandra babu) బయటకి వస్తారు.. గన్ మెన్ లు లేకుండా మీరు బయటకు వస్తారా? అంటూ బుద్ధా వెంకన్న(Buddha Venkanna) వైసీపీ(YCP) నేతలకు సవాల్ విసిరారు. స్పీకర్ పదవి అసెంబ్లీలో(Assembly) టీచర్ లాంటిదని.. స్పీకర్ బయటికి వచ్చి ఏదైనా మాట్లాడాలి అనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. చంద్రబాబు జాతి సంపద అని అన్నారు.
ఎన్ఎస్‌జీ కమెండోలు(NSG Commandos) లేకుండా చంద్రబాబు(Chandra babu) బయటకి వస్తారు.. గన్ మెన్ లు లేకుండా మీరు బయటకు వస్తారా? అంటూ బుద్ధా వెంకన్న(Buddha Venkanna) వైసీపీ(YCP) నేతలకు సవాల్ విసిరారు. స్పీకర్ పదవి అసెంబ్లీలో(Assembly) టీచర్ లాంటిదని.. స్పీకర్ బయటికి వచ్చి ఏదైనా మాట్లాడాలి అనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. చంద్రబాబు జాతి సంపద అని అన్నారు. జగన్(Jagan) పులివెందుల పులి కాదని.. పులివెందుల పిల్లి అని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానంద రెడ్డి తనయ సునీతా రెడ్డిని పులివెందుల పులిగా అభివర్ణించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం గుడివాడ పర్యటన అర్థాంతరంగా ఆపుకోవడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ రోజు సుప్రీంకోర్టులో(Supreme court) అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై వాయిదా ఉంది. అవినాష్ రెడ్డి(avinash reddy) అరెస్ట్ గురించే సీఎం జగన్‌కు తాడేపల్లి ప్యాలెస్‌లో చెమటలు పడుతున్నాయని అన్నారు. ఎందుకు జగన్.. అవినాష్ రెడ్డి అరెస్ట్ పై ఇంత కంగారుపడుతున్నారని.. ఆయనను అరెస్ట్ చేస్తే నిజానిజాలు బయటకొస్తాయనే జగన్‌కు చెమటలు పడుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి.. వివేకా(Viveka) హత్యలో పాత్రదారుడు.. జగన్ సూత్రదారుడనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతుందనే జగన్ కంగారుపడుతున్నారని అన్నారు.
బీసీ నాయకుడు(BC Leader) అయిన నన్ను కేశినేని నాని(Kesineni Nani) ఎన్నోసార్లు అవమానించారని.. ఎన్ని సార్లు అవమానించిన సైలెంట్ గా ఉన్నానని.. ఎవరెన్ని విమర్శలు చేసినా మాట్లాడనని చంద్రబాబుకు మాట ఇచ్చానని.. అంతే తప్ప భయపడి మౌనంగా ఉండటం లేదని పేర్కొన్నారు. నాని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని న్నారు. నానికి నాకు భేదాభిప్రాయాలు వచ్చి విడిగా ఉంటున్నామన్నారు. నాతో నాని గొడవ పడ్డారు. ఇప్పటికీ నేను కేశినేని నానిని ఎంపీగా గౌరవిస్తానని వెల్లడించారు. పార్టీకి నష్టం కలగకూడదని నాని ఏం మాట్లాడినా నేను మాట్లాడటం లేదని అన్నారు.