TDP MLAs : అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రెండో రోజు కూడా పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిరసన తెలుపుతూ తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్రగా వెళ్లారు.
టీడీపీ(TDP) ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీ(MLCs)లు అసెంబ్లీ(Assembly)కి రెండో రోజు కూడా పాదయాత్ర(Padayatra)గా వెళ్లారు. చంద్రబాబు(Chandrababu)ను అక్రమంగా అరెస్ట్(Arrest) చేశారంటూ నిరసన తెలుపుతూ తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్(Tullur Traffic Police Station) నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్రగా వెళ్లారు. రెండోరోజు సమావేశాలలో చంద్రబాబు అరెస్టు అక్రమం అనే అంశంపై పట్టుబడతామని టీడీపీ స్పష్టం చేసింది. అధికార పక్షం ఎంత దూకుడుగా వ్యవహరించినా.. వెనక్కి తగ్గకుండా అసెంబ్లీ, శాసనమండలిలోనూ వ్యవహరిస్తామని టీడీపీ నేతలు వెల్లడించారు.
స్కిల్ డెవల్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌కు ప్రభుత్వానికి స్పీకర్ అనుమతిస్తే.. తమకూ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయాలని టీడీఎల్పీ నిర్ణయించింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఈ అంశాన్ని కూడా సభలో లెవనెత్తాలని టీడీపీ శాసనసభాపక్షం(TDLP) భావిస్తుంది.