ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly sessions) ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly sessions) ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(YS Jgan) దగ్గరకు వెళ్లి తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు(Raghurama krishnam raju) పలకరించారు. పాత పగలన్నీ మర్చిపోయి ఇద్దరు కొన్ని నిమిషాల పాటు ముచ్చటించుకున్నారు. జగన్‌ చేతిలో చేయి వేసి ట్రిపులార్(RRR) మాట్లాడారు. అసెంబ్లీ హాల్‌లో జగన్‌ భుజంపై చేయి వేసి కాసేపు మాట్లాడారు రఘురామకృష్ణరాజు. ఇటీవల తనను హత్య చేయించబోయారంటూ జగన్‌పై రఘురామకృష్ణరాజు కేసు పెట్టిన విషయం తెలిసిందే! ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారనే విషయంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే అసెంబ్లీకి రోజూ రావాలని తాను జగన్‌ను కోరానని, ప్రతిపక్షం సభలో లేకపోతే బాగుండదని చెప్పానని రఘురామకృష్ణరాజు చెప్పారు. అందుకు జగన్‌ సానుకూలంగా స్పందించారని అన్నారు. కొసమెరుపు ఏమిటంటే తనకు జగన్‌ పక్కనే సీటు వేయించాలని స్పీకర్‌ పయ్యావుల కేశవ్‌ను రఘురామ కోరడం!

Eha Tv

Eha Tv

Next Story