తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌పరిరక్షణ సమితి నేతగా పనిచేశారు.

తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌పరిరక్షణ సమితి నేతగా పనిచేశారు. అమరావతి ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన నేతగా గుర్తించబడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీలో సాధారణ లెక్చరర్‌ కెరీర్‌ ప్రారంభించిన కొలికపూడి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరి తిరువూరు టీడీపీ టికెట్‌తో గెలిచారు. ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కొలికపూడి వ్వవహారం కొంత వివాదాస్పదంగానే ఉంటోంది. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఓ సమావేశంలో మాట్లాడుతూ ఓ గ్రామంలో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు, చౌదరీలు 135 మందే ఉన్నారు. కానీ ఆ గ్రామంలో పెత్తనమంతా చౌదరీలదే అని వ్యాఖ్యానించారు. సర్పంచ్ అయినా, సొసైటీ అయినా, ఏవైనా పదవులు వారికే కావాలని కోరుతారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మాత్రం జెండాలు మోయాలన్నారు. మనకు ఎవరూ పిలిచి అవకాశాలు ఇవ్వరని.. తమ హక్కులు పొందేందుకు అణగారిన వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చౌదరీలపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ehatv

ehatv

Next Story