సుప్రీంకోర్టు(Supreme court) తీర్పును తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapud srinivas) తప్పుపట్టడమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టు(Supreme court) తీర్పును తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapud srinivas) తప్పుపట్టడమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఒక దుర్మార్గమైన, అన్యాయమైన, దారుణమైన తీర్పు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు. పుదుచ్చేరికి చెందిన సెల్వరాణి(Selvarani) అనే మహిళ కేసులో మద్రాస్‌ హైకోర్టు(Madras high court) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. క్రిస్టియానిటీలోకి మారిన మహిళకు ఎస్సీ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను(SC Certificate) మంజూరు చేయడానికి మద్రాస్‌ హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం రిజర్వేషన్ ప్రయోజనాన్ని ద‌క్కించుకునేందుకు సెల్వరాణి తాను హిందువునని పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌ల ధర్మాసనం తప్పుబట్టింది. ఇత‌ర మ‌త విశ్వాసాల‌ను అనుస‌రిస్తూ, రిజ‌ర్వేష‌న్ల ప్ర‌యోజ‌నాల కోసం హిందువుల‌మ‌ని చెప్పుకోవ‌డం రాజ్యాంగాన్ని మోస‌గించ‌డ‌మేనని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మ‌త‌ప‌ర‌మైన‌ విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమే మ‌రో మ‌తానికి సంబంధించిన వాళ్ల‌మ‌ని చెప్పుకోవ‌డాన్ని అనుమ‌తించ‌మ‌ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెల్వరాణి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని, చర్చికి వెళుతూ ప్రార్థనలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ తీర్పుపై కొలికపూడి శ్రీనివాసరావు దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ దేశ అత్యున్న‌త న్యాయ స్థానం ఒక దుర్మార్గ‌మైన, అన్యాయ‌మైన‌, దారుణ‌మైన తీర్పు ఇచ్చిందని కామెంట్‌ చేసిన కొలికపూడి ..ఈ దేశంలో సామాజికంగా వెనుక‌బ‌డిన కులాల‌కి బాబాసాహెబ్ అంబేద్క‌ర్ రిజ‌ర్వేష‌న్ ఇచ్చారని గుర్తు చేశారు.

ఇప్పుడు క్రైస్త‌వులైతే రిజ‌ర్వేష‌న్లు వుండ‌వ‌ని సుప్రీంకోర్టు చెప్పడమేమిటని ప్రశ్నించారు. కులానికి రాజ్యాంగం రిజ‌ర్వేష‌న్ ఇచ్చింద‌ని, దాన్ని మ‌తంతో లింకు పెట్టి, సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా, ఎవ‌రు తీర్పు చెప్పినా అది తప్పేనని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story