తన రాజీనామాను ఆమోదించారంటూ వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వివరణ ఇచ్చుకున్నారు. తన రాజీనామా ఆమోదం పొందలేదని స్పష్టం చేశారు. రాజీనామాపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

తన రాజీనామాను ఆమోదించారంటూ వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వివరణ ఇచ్చుకున్నారు. తన రాజీనామా ఆమోదం పొందలేదని స్పష్టం చేశారు. రాజీనామాపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. రెండేళ్ల నుంచి ఆమోదించని రాజీనామాను గంటలలో ఓటింగ్‌ అనగా ఆమోదిస్తారా అంటూ గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. తన రాజీనామా ఆమోదం పొందిందంటూ రాత్రి నుంచి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రెండేళ్ల క్రితం రాజీనామా చేసిన తాను స్పీకర్‌ను వ్యక్తిగతంగా రెండుసార్లు కలిశానని గంటా తెలిపారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వైసీసీ చేస్తున్న దుష్ప్రచారమే తప్ప వాస్తవం లేదన్నారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ(Panchumarthi Anuradha) నామినేషన్‌ పత్రాలపై ప్రపోజల్ సంతకం చేసింది తానేనని, అనురాధ గెలువబోతున్నారని గంటా చెప్పారు. ఓటరు లిస్ట్‌ వచ్చాక రాజీనామా ఆమోదించడం అన్నది సాంకేతికంగా సాధ్యం కాదని, రూల్స్‌కు వ్యతిరేకంగా వైసీపీ అలా చేస్తే మాత్రం పెద్ద తప్పు చేసినట్టు అవుతందని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఒక ఎమ్మెల్సీ గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP)0కి 151, టీడీపీ(TDP)కి 23, జనసేన(Janasena)కు ఒకరు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా నలుగురు సభ్యులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ బలం 19 మంది సభ్యులుగా ఉంది. అలాగే జనసేనకు ఉన్న ఒక సభ్యుడు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉండడంతో ఏడు స్థానాలకు అభ్యర్థులను బరిలో దించింది. ఈ క్రమంలో ఒక స్థానం గెలవడానికి టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

Updated On 23 March 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story