తెలుగుదేశం పార్టీ(TDP) 11 మందితో మూడో జాబితాను కూడా ప్రకటించింది. మొదటి జాబితాలో 94, రెండో జాబితాలో 34 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినాయకత్వం ఇప్పుడు 11 మందితో మూడో జాబితాను ప్రకటించింది. ఇంకా అయిదు స్థానాలలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 13 మంది లోక్‌సభ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ స్థానాలలో టీడీపీ 17 చోట్ల పోటీ చేయనుంది. ఎనిమిది స్థానాలను మిత్రపక్షాలైన జనసేన(Janasena), బీజేపీలకు(BJP) కేటాయించింది.

తెలుగుదేశం పార్టీ(TDP) 11 మందితో మూడో జాబితాను కూడా ప్రకటించింది. మొదటి జాబితాలో 94, రెండో జాబితాలో 34 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినాయకత్వం ఇప్పుడు 11 మందితో మూడో జాబితాను ప్రకటించింది. ఇంకా అయిదు స్థానాలలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 13 మంది లోక్‌సభ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ స్థానాలలో టీడీపీ 17 చోట్ల పోటీ చేయనుంది. ఎనిమిది స్థానాలను మిత్రపక్షాలైన జనసేన(Janasena), బీజేపీలకు(BJP) కేటాయించింది. ఈ 17లో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ స్థానాల జాబితాలో దేవినేని ఉమ(Devineni uma) పేరు కనిపించకపోవడం ఆశ్చర్యం. దీంతో దేవినేని ఉమ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. మైలవరం నియోజకవర్గం టికెట్‌ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌కు ఇచ్చారు చంద్రబాబు. దేవినేని ఉమను పెనమలూరు నియోజకవర్గానికి పంపాలనుకున్నారు. కానీ అక్కడ ఆల్‌రెడీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేరును ఖరారు చేశారు. దీంతో దేవినేని ఉమకు నియోజకవర్గం అంటూ లేకపోయింది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమ తెలుగుదేశంపార్టీకే అంకితమయ్యారు. విపక్షంలో ఉన్నప్పుడు కూడా తెగించి అధికారపక్షంతో పోరాడారు. అలాంటి దేవినేని ఉమకు టికెట్‌ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమే! అలాగే ఉండవల్లి శ్రీదేవి(Undavlli sridevi) కూడా టికెట్‌ కేటాయించలేదు. టికెట్‌పై ఆమె చాలా ఆశలు పెట్టుకున్నారు. తనకు టికెట్ గ్యారంటీ అని అనుకున్నారు. అసలు దేవినేని ఉమ, ఉండవల్లి శ్రీదేవిలకు పార్టీ అధినాయకత్వం ఎందుకు టికెట్‌ ఇవ్వలేదో తెలుసుకుందాం!

Updated On 22 March 2024 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story