Chintamaneni Prabhakar : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై 93 కేసులు..!
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై పలు నేరాలకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో రౌడీషీట్ సహా దాదాపు 93 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

TDP MLA candidate Chintamaneni Prabhakar has 93 cases against him
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై పలు నేరాలకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో రౌడీషీట్ సహా దాదాపు 93 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో తహశీల్దార్ వనజాక్షిపై దాడి, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌పై దాడి కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్ధులలో ఎక్కువ కేసులున్న అభ్యర్ధి చింతమనేని కావడం విశేషం. ఈ మేరకు వివరాలు భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న చింతమనేని ప్రభాకర్ వరుసగా రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అభ్యర్థి కే అబ్బయ్య చౌదరితో తలపడనున్నారు.
చింతమనేని ప్రభాకర్ ఆస్తులు:
చింతమనేని, ఆయన కుటుంబానికి దాదాపు రూ.50 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. రూ.2.50 కోట్ల చరాస్తులు ఉన్నాయి.
అప్పులు
చింతమనేనికి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో రూ.10,03,580 బంగారు రుణం, రూ.67,30,891 తనఖా రుణం ఉంది. చింతమనేని, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం అప్పులు రూ.1.81 కోట్లు.
చింతమనేని 1984-85లో సీఆర్ రెడ్డి కళాశాల ఏలూరులో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు.
