TDP leader Video Leak : సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్ కలకలం
సత్యవేడు(Satyavedu) టీడీపీ(TDP) ఎమ్మెల్యే కె.ఆదిమూలం(K Adimulam) రాసలీలలు వీడియోలు బయటపడ్డాయి.
సత్యవేడు(Satyavedu) టీడీపీ(TDP) ఎమ్మెల్యే కె.ఆదిమూలం(K Adimulam) రాసలీలలు వీడియోలు బయటపడ్డాయి. టీడీపీ మహిళా నేతతో సంభోగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social media) కలకలం రేపుతోంది. తనను సెక్స్ చేయాలంటూ ఒత్తిడి చేసి పలుసార్లు లొంగదీసుకున్నాడని టీడీపీ మహిళా నేత ఆరోపించింది. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని కోనేటి ఆదిమూలంపై ఆమె ఫిర్యాదు చేసింది. వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలానికి టికెట్ ఇవ్వడం మాకు ఇష్టం లేదని, అయినా పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదిమూలం గెలుపునకు తన భర్త, తాను నిర్వారామంగా కృషి చేశామని మహిళా నేత అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదేపదే ఫోన్లు చేసి లైంగికంగా వేధించేవాడని, సెక్స్ చేయాలంటూ భయభ్రాంతులకు గురిచేసేవాడని ఆమె ఆరోపించారు. భీమాస్ ప్యారడైజ్ హోటల్‌కు తీసుకెళ్లి తనతో బలవంతంగా సెక్స్ చేశాడన్నారు. అర్ధరాత్రులు ఫోన్ చేస్తూ వేధించేవాడని, ఇది గమనించిన తన భర్తకు విషయం మొత్తం చెప్పగా అతనికి గట్టి బుద్ధిచెప్పాలన్న ఉద్దేశంతో, తన భర్త ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే కోరిన రోజు ఆయన దగ్గరకు వెళ్లి సీక్రెట్ కెమెరా పెట్టి కామకలాపాలను రికార్డ్ చేశామన్నారు. ఈపెన్ కెమెరాను తన భర్తకు అందించానని, పార్టీ అధినేత చంద్రబాబు చట్టపరమైన చర్యలు తీసుకొని, తమ కుటుంబానికి రక్షణగా నిలవాలని కోరారు. అయితే ఈ వీడియోపై ఎమ్మెల్యే ఆదిమూలం ఖండించారు. తన వెనుక ఎవరో కుట్రపన్నారని, మార్ఫింగ్ చేసి వీడియో పెట్టినట్లు తెలిపారు.
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2024
చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ ఫిర్యాదు. pic.twitter.com/QJCMDCrOtW