మేమంతా సిద్ధం పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి (CM YS Jagan)బస్సు యాత్ర(Bus Yatra) విజయవాడ(Vijayawada)లో సాగుతున్నప్పుడు ఆయనపై ఓ అగంతకుడు రాయితో దాడి చేసిన విషయం విదితమే! ఆయన ఎడమకంటిపై భాగంగా దెబ్బ తగిలింది. దాడి జరిగిన వెంటనే ప్రధాన నరేంద్రమోదీ(PM Modi) స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మేమంతా సిద్ధం పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి (CM YS Jagan)బస్సు యాత్ర(Bus Yatra) విజయవాడ(Vijayawada)లో సాగుతున్నప్పుడు ఆయనపై ఓ అగంతకుడు రాయితో దాడి చేసిన విషయం విదితమే! ఆయన ఎడమకంటిపై భాగంగా దెబ్బ తగిలింది. దాడి జరిగిన వెంటనే ప్రధాన నరేంద్రమోదీ(PM Modi) స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌(M. K. Stalin), తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) కూడా దాడిని ఖండించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) మొక్కుబడిగా దాడిని ఖండించారు. రాబోయే రోజుల్లో మాత్రం చంద్రబాబు నుంచి వెటకారపు మాటలు పక్కాగా వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నైజమే అది! ఇప్పుడు జగన్‌(Jagan)పై కేవలం భౌతిక దాడి మాత్రమే జరిగింది. కానీ పుష్కరకాలంగా ఆయన వ్యక్తిత్వంపై టీడీపీ మీ(Chandrababu)డియా చేస్తున్న దాడి మాటేమిటి? దేశంలో మరే రాజకీయ నాయకుడిపై మీడియాలో ఇంతగా దాడి జరగలేదు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా మీడియాలో దాడి జరిగింది. టీడీపీ అనుకూల మీడియా కేసీఆర్‌(KCR)పై అడ్డమైన రాతలుTDP Medai రాసింది. ఇప్పుడు మళ్లీ చెలరేగిపోతున్నది. ఇప్పుడు మళ్లీ జగన్‌ విషయానికి వద్దాం. ప్రతి రోజూ జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై తప్పుడు కథనాలు రాస్తూ వస్తున్నది టీడీపీ మీడియా. జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతి(YS Barathi) ప్రజల మధ్యన నిలబడి తన భర్తకు చేతులు ఊపుతూ ప్రోత్సహించడం కూడా టీడీపీ మీడియాకు మింగుడుపడలేదు. దాన్ని బిల్డప్‌గా అభివర్ణిస్తూ సంతృప్తి పడింది. అదే భువనేశ్వరి(Nara Bhuvaneswari) చేస్తే ఇలాంటి రాతలు రాయడానికి చేతులు రావు. అప్పుడు భువనేశ్వరిపై కితాబు రాతలే రాస్తాయి. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పదే పదే చెప్పుకొచ్చే రెండు పత్రికలు జర్నలిజానికి ఏనాడో తిలోదకాలు ఇచ్చాయి. ప్రతి రోజూ జగన్‌కు వ్యతిరేక కథనాలు వండి వారుస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు పత్రికలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. ప్రజల మనస్సులో విషబీజాలు నాటడమే ఆ పత్రికల ధ్యేయం. జగన్‌పై ఎవరో రాయితో దాడి చేస్తే ఆ పేపర్లకు ప్రధాన అంశమే కాలేదు. మొత్తంమీద జగన్‌పై ఎల్లో మీడియా ఎప్పట్నుంచో దాడులు చేస్తూనే ఉంది.

Updated On 15 April 2024 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story