నారా లోకేశ్(Nara lokesh) ఆధ్వర్యంలోని టీడీపీ(TDP) నేతల బృందం గవర్నర్(Governor) ను క‌లిసింది. గవర్నర్ ను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు(Achchennaidu), కొల్లు రవీంద్ర(Kollu Ravindhra), పీతల సుజాత, ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్ బాబు త‌దిత‌రులు ఉన్నారు. అనంత‌రం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ(YCP) ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు.

నారా లోకేశ్(Nara lokesh) ఆధ్వర్యంలోని టీడీపీ(TDP) నేతల బృందం గవర్నర్(Governor) ను క‌లిసింది. గవర్నర్ ను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు(Achchennaidu), కొల్లు రవీంద్ర(Kollu Ravindhra), పీతల సుజాత, ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్ బాబు త‌దిత‌రులు ఉన్నారు. అనంత‌రం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ(YCP) ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు. వైసీపీ సర్కార్ కక్షసాధింపుపై ఆధారాలతో సహా వివరించామ‌ని వెల్ల‌డించారు. టీడీపీ నేతలపై 260 కేసులు పెట్టిన తీరును గవర్నర్‍కు వివరించామ‌న్నారు. టీడీపీ సానుభుతిపరులపై 60 వేల కేసులు పెట్టిన విషయం చెప్పామ‌న్నారు. ప్రజల తరపున పోరాడుతున్నవారిపై.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై ఎలా దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారో గవర్నర్ కు వివరించామ‌న్నారు.

ఏపీ దక్షిణాది బీహార్ ల(Bihar) మారిపోయిందన్నారు. యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా కేసులు పెట్టారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడవల్సిందిగా గవర్నర్‍ను కోరామ‌న్నారు. ఏపీలో ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగాయన్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా మేము ఉంటామ‌న్నారు. సైకో జగన్‍పై ఇక యుద్దమేన‌ని హెచ్చ‌రించారు. దొంగ ఓట్లపై టీడీపీ పోరాటం ఆగదన్నారు. జగన్ 38 కేసుల్లో నిందితుడు.. పదేళ్లుగా బెయిల్‍పై బయట ఉన్నాడని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

Updated On 7 Nov 2023 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story