కడప(Kadapa) జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఎవరిపైనా? అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపైన(Chandrababu), ఆంధ్రజ్యోతి(Andhra jyothi) సంస్థల ఎండీ రాధాకృష్ణపైన(Radha Krishna). కడప జిల్లాలో తెలుగుదేశంపార్టీని భ్రష్టుపట్టించడం కోసం రాధాకృష్ణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది తెలుగు తమ్ముళ్ల మనోగతం! ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే, పులివెందులకు సంబంధించి పార్థసారథి రెడ్డి పేరు జిల్లా రాజకీయాలలో తెలియనివారు ఎవరూ ఉండరు. వైఎస్‌ కుటుంబంతో దశాబ్దాలుగా పోరాడుతూ వస్తున్నారు. వైఎస్‌ కుటుంబంతో ఉన్న ఫ్యాక్షన్‌ కారణంగా తమ కుటుంబసభ్యులను పోగొట్టుకున్నారు పార్థసారథి రెడ్డి.

కడప(Kadapa) జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఎవరిపైనా? అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపైన(Chandrababu), ఆంధ్రజ్యోతి(Andhra jyothi) సంస్థల ఎండీ రాధాకృష్ణపైన(Radha Krishna). కడప జిల్లాలో తెలుగుదేశంపార్టీని భ్రష్టుపట్టించడం కోసం రాధాకృష్ణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది తెలుగు తమ్ముళ్ల మనోగతం! ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే, పులివెందులకు సంబంధించి పార్థసారథి రెడ్డి పేరు జిల్లా రాజకీయాలలో తెలియనివారు ఎవరూ ఉండరు. వైఎస్‌ కుటుంబంతో దశాబ్దాలుగా పోరాడుతూ వస్తున్నారు. వైఎస్‌ కుటుంబంతో(YS Family) ఉన్న ఫ్యాక్షన్‌ కారణంగా తమ కుటుంబసభ్యులను పోగొట్టుకున్నారు పార్థసారథి రెడ్డి(Parthasarathy Reddy). గడచిన 30 ఏళ్లుగా పార్థసారథి రెడ్డి తెలుగుదేశంపార్టీ కోసం పని చేస్తూ వస్తున్నారు. టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ సతీష్‌ రెడ్డితో పాటు పార్థసారథి రెడ్డి టీడీపీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటూ వస్తున్నారు. సతీష్‌రెడ్డి కంటే ముందు నుంచే వైఎస్‌ ఫ్యామిలీపై పోరాడిన వ్యక్తి పార్థసారథి రెడ్డి. వైఎస్‌ కారణంగా ఈయన చాలా నష్టపోయారు. ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ ఈయన టీడీపీని వదలకుండా పార్టీ కోసం పని చేస్తూ వస్తున్నారు. అయితే లేటెస్ట్‌గా అక్కడ లోక్‌సభ స్థానానికి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మను అభ్యర్థిగా ప్రకటించబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల వెనుక, ఇలాంటి ప్రచారం వెనుక టీడీపీ అనుకూల మీడియా ఉందని అందరూ భావిస్తున్నారు. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదు, అలాంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. ఆమెను లోక్‌సభ బరిలో దింపడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్థసారథి రెడ్డికి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంతో, ముఖ్యంగా వైఎస్‌ వివేకానందరెడ్డి ఫ్యామిలీతో సంవత్సరాల తరబడి శత్రుత్వం ఉంది. ఇప్పుడు సౌభాగ్యమ్మను తెరమీదకు తీసుకురావడం పట్ల పార్థసారథి రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గడచిన 30 సంవత్సరాలుగా ఎవరితోనైతే పోరాడుతున్నామో, వారిని తీసుకొచ్చి మా భుజాలపైన గెలిపించమంటే ఎలా గెలిపిస్తామన్నది పార్థసారథి రెడ్డి వాదన. పార్టీ కోసం పని చేస్తూ, కుటుంబసభ్యులకు పొగొట్టుకున్న తమకు పార్టీ ఇస్తున్న భరోసా ఏమిటి? పార్టీ వైపు నుంచి మమ్మల్ని ఆదుకున్నదేమిటి? పార్టీ మాకు ఎలాంటి షెల్టర్ కల్పించింది? చేసిన ఆర్థిక సాయమేమిటి? ఇవేవీ చేయకుండా 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని వదిలేసి, టీడీపీ కార్యకర్తల మరణానికి కారణమైన వివేకానందరెడ్డిగారి సతీమణిని తీసుకొచ్చి టీడీపీ అభ్యర్థిగా పెడతారా? ఏమి ఆశించి ఇలాంటి ప్రయోగం చేస్తున్నారు? మాపై అప్పటి ప్రభుత్వం కేసులు పెడితే ఖర్చుల కోసం పైసా ఇవ్వని టీడీపీ ఇప్పుడు వైఎస్‌ వివేకా ఫ్యామిలీ కోసం కోట్లు ఖర్చుపెడుతోంది. రాధాకృష్ణ తన అవసరాల కోసం, జగన్‌పై దుష్ర్పచారం చేయడం కోసం వైఎస్‌ వివేకా ఫ్యామిలీని నెత్తిన ఎత్తుకుంటే మొత్తం జిల్లా టీడీపీ నాయకత్వం అంతా మోయాలా? జిల్లా టీడీపీని ఆ పత్రికాధిపతి తాట్టు పెడితే సహించాలా? ఇది కడప టీడీపీ క్యాడర్‌ ఆవేదన! కడప లోక్‌సభ టికెట్‌ను ఎవరికి ఇవ్వాలో రాధాకృష్ణనే తేల్చేస్తే మరి మేమేందుకు? అని నేతలు ప్రశ్నిస్తున్నారు.

Updated On 11 March 2024 4:04 AM GMT
Ehatv

Ehatv

Next Story