Panchumarthi Anuradha : 27 సార్లు ఢిల్లీకెళ్లి జగన్ సాధించిందేంటి.?
బిల్డప్ సీఎం జగన్(CM Jagan) 27 సార్లు ఢిల్లీకెళ్లి(Delhi Tour) సాధించేందేంటి? అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(Panchumarthi Anuradha) ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, త్రిబుల్ ఐటీ నిధులు, వెనుకబడిన జిల్లాల రూ. 1400 కోట్ల ప్యాకేజీ ఏమైంది? అని ప్రశ్నించారు. పెట్రో కాంప్లెక్స్, తిరుపతి ఐజర్ కి నిధులు ఏమయ్యాయి? అని నిలదీశారు.

Panchumarthi Anuradha
బిల్డప్ సీఎం జగన్(CM Jagan) 27 సార్లు ఢిల్లీకెళ్లి(Delhi Tour) సాధించేందేంటి? అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(Panchumarthi Anuradha) ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, త్రిబుల్ ఐటీ నిధులు, వెనుకబడిన జిల్లాల రూ. 1400 కోట్ల ప్యాకేజీ ఏమైంది? అని ప్రశ్నించారు. పెట్రో కాంప్లెక్స్, తిరుపతి ఐజర్ కి నిధులు ఏమయ్యాయి? అని నిలదీశారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని అన్నారు. 9,371 ఎకరాల్లో గంజాయి ద్వసం చేశామన్నారు.. వాటి రుజువులు ఏవి? పోటోలున్నాయా? విజువల్స్ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిజంగా గంజాయిని అరికడితే బెంగుళూరు, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, మద్యప్రదేశ్ లలో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వచ్చాయని అక్కడి పోలీసు అధికారులు ఎందుకు చెబుతారు? అని అడిగారు.
బెంగుళూరులో కస్టమ్స్ అధికారులు ఓ పార్సిల్ ను పరిశీలిస్తే 4.49 కిలోల ఎఫిడ్రిన్ అనే మత్తు పదార్దం దొరికింది. ఇది విజయవాడ భారతీ నగర్ లోని కొరియర్ సంస్ధ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్టు గుర్తించారు. గతంలో గుజరాత్ ముంద్రా పోర్టులో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ ద్వారా బెజవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న 72 వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర ప్రజల్ని నాశనం చేసి గంజాయి పండించి వైసీపీ ఎమ్మెల్యేలు కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సీఎంకి సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. రాయలసీమ ఎండిపోయేలా తీర్మానం చేస్తే.. కేంద్ర జలశక్తి మంత్రిని ఎందుకు కలవలేదన్నారు. కలవాల్సింది ఇరిగేషన్ మంత్రినా? నిర్మలా సీతారామన్ గారినా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు.. తన కేసుల మాఫీ కోసమే సీఎం ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారని ఆరోపించారు.
అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. జీ20 సదస్సులో అరకు కాఫీని విదేశీ ప్రతినిధులకు గిప్ట్ గా ఇచ్చినందుకు చంద్రన్నకు పాధాబివందనం.. అలాంటి ఉత్తరాంధ్రని గంజాయితో నాశనం చేస్తూ.. కేంద్రానికి తప్పుడు నివేదికలిస్తారా? అని ప్రశ్నించారు. గంజాయికి బానిసలై తాడేపల్లి సీఎం ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ పై ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. సీఎం జగన్ అబద్దాల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఢిల్లీ వెళ్లిన సీఎం ట్రిబ్యునల్ గురించి ప్రధానిని కలవకుండా అక్కడే ఉండి లేఖ రాయడం ఏంటి? అని ప్రశ్నించారు. సీమను ఎడారి చేసేలా నిర్ణయాలు జరుగుతున్నా.. జగన్ మాత్రం ఏమీ పట్టనట్టున్నారని విమర్శించారు. జగన్ సీమకు చేస్తున్న అన్యాయం ప్రజలకు అర్దమైందన్నారు.
