తెలుగుదేశంపార్టీ(TDP) నేత మాండ్ర శివానందరెడ్డి(Mandra Sivananda Reddy) భూకబ్జా కేసులో చిక్కుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీలో (CID)సైబర్‌క్రైమ్‌ ఎస్పీగా పని చేస్తూ స్వచ్ఛంద పదవీవిరమణ చేసిన ఈయన తెలుగుదేశంపార్టీలో(TDP) చేరారు. 2019 ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి వరకు నంద్యాల లోక్‌సభ నియోజకర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

తెలుగుదేశంపార్టీ(TDP) నేత మాండ్ర శివానందరెడ్డి(Mandra Sivananda Reddy) భూకబ్జా కేసులో(Land Grabbing case) చిక్కుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీలో (CID)సైబర్‌క్రైమ్‌ ఎస్పీగా పని చేస్తూ స్వచ్ఛంద పదవీవిరమణ చేసిన ఈయన తెలుగుదేశంపార్టీలో(TDP) చేరారు. 2019 ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి వరకు నంద్యాల లోక్‌సభ నియోజకర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఈయన పేరు మీడియాలో మారుమోగుతోంది. అందుకు కారణం బుద్వేల్‌లోని(Budvel) అసైన్డ్ భూములు కాజేయడానికి కుట్ర చేయడమే! ఈ విషయం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు గుర్తించారు. ఆయనపై ఈ నెల 2వ తేదీన కేసు పెట్టారు పోలీసులు. నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఉన్న తనను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు వస్తున్నారని తెలుసుకుని మాండ్ర పారిపోయారు. వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బుద్వేల్ దగ్గర కొంతమంది ఎస్సీ కమ్యూనిటీకి అసైన్డ్ ల్యాండ్‌లను పంపిణీ చేసి పాస్ పుస్తకాలను కూడా జారీ చేశారు. వాటిని దక్కించుకోవడానికి మాండ్ర శివానందరెడ్డి తనకు తెలిసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టి.జె.ప్రకాష్, కోనేరు గాందీ, ఎస్‌.దశరథ రామారావులను రంగంలోకి దింపారు. ఆ తర్వాత అసైన్డ్ పట్టాదారులకు నామమాత్రం చెల్లించి 26 ఎకరాల భూములను తన కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు రాత్రికి రాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నట్టు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక మెమో ద్వారా అసైన్డు భూముల స్వభావాన్ని ఆయన మార్చారని తేలింది. దీంతో సీసీఎస్ అధికారులు మాండ్ర శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు నంద్యాల జిల్లా అళ్లూరు వెళ్లారు. అయితే పోలీసుల కళ్లుగప్పి ఆయన పరారయ్యాడు.

Updated On 5 April 2024 6:44 AM GMT
Ehatv

Ehatv

Next Story