అవతలివారి మీద రాళ్లు విసరడానికి సిద్ధంగా ఉండే తెలుగుదేశంపార్టీ(TDP) విశాఖ తీరంలో డ్రగ్స్‌(Cocaine) దొరకడంతో సైలెంటయ్యింది. ఆ పార్టీ అనుకూల మీడియా కూడా నోరు మెదపడం లేదు. ఒకటా రెండా ఏకంగా 25 వేల కిలలో డ్రగ్స్‌ విశాఖ తీరంలో దొరికాయి. పాత సినిమాలో స్మగ్లింగ్‌ సన్నివేశాలు ఉంటాయి కదా! అచ్చంగా అలాగే బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు(Santos Port) నుంచి బయలుదేరిన జిన్‌ లియన్‌ యన్‌ గ్యాంగ్‌ కంటైనర్‌ నౌక ఈ నెల 16వ తేదీన రాత్రి 9.30 గంటలకు విశాఖపట్నం పోర్టు టెర్మినల్‌-2కు వచ్చి చేరింది.

అవతలివారి మీద రాళ్లు విసరడానికి సిద్ధంగా ఉండే తెలుగుదేశంపార్టీ(TDP) విశాఖ తీరంలో డ్రగ్స్‌(Cocaine) దొరకడంతో సైలెంటయ్యింది. ఆ పార్టీ అనుకూల మీడియా కూడా నోరు మెదపడం లేదు. ఒకటా రెండా ఏకంగా 25 వేల కిలలో డ్రగ్స్‌ విశాఖ తీరంలో దొరికాయి. పాత సినిమాలో స్మగ్లింగ్‌ సన్నివేశాలు ఉంటాయి కదా! అచ్చంగా అలాగే బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు(Santos Port) నుంచి బయలుదేరిన జిన్‌ లియన్‌ యన్‌ గ్యాంగ్‌ కంటైనర్‌ నౌక ఈ నెల 16వ తేదీన రాత్రి 9.30 గంటలకు విశాఖపట్నం పోర్టు టెర్మినల్‌-2కు వచ్చి చేరింది. ఇందులోనే భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ(CBI) అధికారులు పట్టుకున్నారు. ఇంటర్‌పోల్‌ సమాచారంతో ఆపరేషన్‌ గరుడను చేపట్టి స్మగ్లంగ్‌ను అరికట్టింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా డ్రైఈస్ట్‌తో కలిపి బ్యాగులలో ప్యాక్‌ చేసిన డ్రగ్స్‌ కంటైనర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో పాతిక కిలోల చొప్పున వెయ్యి బ్యాగులను చూసి ఆశ్చర్యపోయారు. పాతిక వేల కిలోల ఇనాక్టివ్‌ డ్రైఈస్ట్‌తో(Dried Yeast) మిక్స్‌ అయిన డ్రగ్స్‌ ఉండటం చూసి బిత్తరపోయారు. ఈ కంటైనర్‌ ఎవరిదో ఆరా తీశారు.

ఈ స్మగ్లింగ్‌ వ్యాపారంలో తెలుగుదేశంపార్టీ నేతలది కీలక పాత్ర అని స్పష్టమయ్యింది. బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeswari) కుటుంబం కూడా ఉందట! నౌకలో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్‌ యార్డ్‌లో అన్‌లోడ్‌ చేశారు. అయితే ఎస్‌ఈకేయూ 4375380 నెంబర్‌తో ఉన్న కంటైనర్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని, సోదా చేయాలని ఈ నెల 18వ తేదీన ఇంటర్‌పోల్ నుంచి సీబీఐకు ఒక ఈ మెయిల్‌ వచ్చింది. వెంటనే ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారులు అలెర్టయ్యారు. దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీలు ఉమేశ్‌ శర్మ(Umesh Sharma), ఆకాశ్‌ కుమార్‌ మీనాలకు అప్పగించారు. నార్కోటిక్‌ డిటెక్షన్‌ కిట్‌తో సీబీఐ బృందం ఈ నెల 19వ తేదీ ఉదయం 8.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. సీబీఐ ఎస్పీ గౌరవ్‌ మిట్టల్‌ పర్యవేక్షణలోనే ఆపరేషన్‌ అంతా జరిగింది. విశాఖ సీబీఐ డీఎస్పీ సంజయ్‌కుమార్‌ సమల్‌తో కలిసి విశాఖ పోర్టు విజిలెన్స్, కస్టమ్స్‌ అధికారుల సహకారంతో పోర్టులో విస్తృతంగా సోదాలు చేశారు.

ఇంటర్‌పోల్‌ చెప్పిన కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. లాసెన్స్‌ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో ఆ కంటైనర్‌ ఉంది. ఈ కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కూనం వీరభద్రరావు ఉన్నారు. సీఈవో బాధ్యతలను ఆయన కొడుకు కోటయ్య చౌదరి నిర్వహిస్తున్నారు. వీరిద్దరు విశాఖలో అందుబాటులో లేకపోవడంతో ఆ కంపెనీ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్ ఆర్‌.వి.ఎల్.ఎన్‌.గిరిధర్‌, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్‌, కె.భరత్‌కుమార్‌లను పిలిపించారు. కంటైనర్‌లో ఉన్నదేమిటో చెప్పాలన్నారు. కంటైనర్‌లో 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగ్‌లలో ఇనాక్టివ్‌ డ్రై ఈస్ట్‌ ఉందని చెప్పారు.

అంటే 25 వేల కిలోలన్నమాట! అధికారులు కంటైనర్‌ను తెరిచి చూసి ఉలిక్కిపడ్డారు. కంటైనర్‌లో 20 బాక్స్‌లలో వెయ్యి బ్యాగులు ఉన్నట్టు గుర్తించారు. ఆ బ్యాగులన్నింటినీ కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే బయటకు తీశారు. ఆ బ్యాగులలో పచ్చ రంగులో ఉన్న పౌడర్‌ను పరీక్షించిన సీబీఐ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ పౌడర్‌ను నార్కోటిక్‌ డ్రగ్స్‌ డిటెక్షన్‌ కిట్‌తో పరీక్షించిన అధికారులు అందులో కొకైన్‌, మెథాక్వాలోన్‌, ఓపియం, మారిజోనా, హాషిష్‌ మాదక ద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులలో భయాందోళనలు మొదలయ్యాయి. తాము వీటిని మొదటిసారి దిగుమతి చేసుకున్నామని, అందులో ఉన్న పదార్థాల గురించి తమకేమీ తెలియదని చెప్పుకొచ్చారు. మళ్లీ 20వ తేదీ ఉదయం 10.15 గంటలకు సీబీఐ బృందం విశాఖ పోర్టుకు చేరుకుంది. ఈసారి సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కూనం హరికృష్ణ, ఇతరుల పిలిపించింది.

వారి సమక్షంలోనే మరికొన్ని బ్యాగులను పరీక్షించారు. అన్ని బ్యాగుల్లోనూ మాదక ద్రవ్యాలు(Drugs) ఉన్నాయి. కంపెనీ ప్రతినిధులను అడిగితే వారు బిక్కమొహం వేశారు. ఎవరూ కచ్చితమైన జవాబు చెప్పలేకపోయారు. దీంతో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంధ్యా ఆక్వా అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీలో సోదాలు జరిగాయి. అనుమతి లేకుండా ఈక్విడార్‌ దేశం నుంచి రొయ్యలను దిగుమతి చేసుకుని వాటిని ప్రాసెస్‌ చేసి అమెరికాకు ఎగుమతి చేశారని స్పష్టమయ్యింది. ఒక దేశం నుంచి దిగుమతి చేసుకుని మరో దేశానికి ఎగుమతి చేయడం చట్టవిరుద్ధం. కానీ సంధ్యా ఆక్వా మేనేజింగ్ డైరెక్టర్‌ కూనం వీరభద్రరావు చౌదరి ఈ పని చేశారు. అంతేనా.. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కూడా ఉల్లంఘించారు. అదొక్కటే కాదు, ఇంకా 16 ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సంధ్యా ఆక్వా కంపెనీని సీజ్‌ చేశారు. కూనం వీరభద్రరావు మామూలోడు కాదు. 2016లోనే అమెరికా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 2016 జులై 30వ తేదీన లాస్‌ ఏంజిలిస్‌ నుంచి న్యూజెర్సీకి వెళుతున్న విమానంలో తన పక్కనే ఉన్న మహిళా ప్రయాణికురాలిని లైంగికంగా వేధించాడు. వీరభద్రరావును ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసి న్యూయార్క్‌ కోర్టులో హాజరుపరిచారు. తానా ప్రతినిధుల సహాయంతో ఎలాగోలా ఈ కేసు నుంచి బయటపడ్డాడు. అన్నట్టు ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కూడా వీరభద్రరావు హ్యాండ్‌ ఉందని రూఢీ అయ్యింది.

Updated On 22 March 2024 12:31 AM GMT
Ehatv

Ehatv

Next Story