TDP Leader Kesineni Chinni : అరాచక సీఎంను తరిమికొట్టాలి..
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టు(Chandrababu arrest)తో నిన్న అత్యంత దుర్దినమని ఆ పార్టీ నేత కేశినేని చిన్ని(Kesineni Chinni )వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకపోయినా దొంగ సెక్షన్‌లు పెట్టారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక హీనంగా వ్యవహరించారని మండిపడ్డారు.

TDP Leader Kesineni Chinni
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టు(Chandrababu arrest)తో నిన్న అత్యంత దుర్దినమని ఆ పార్టీ నేత కేశినేని చిన్ని(Kesineni Chinni )వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకపోయినా దొంగ సెక్షన్‌లు పెట్టారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక హీనంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇసుక, మైనింగ్, మద్యం ద్వారా వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ(ycp) అవినీతిని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు కడిగిన ముత్యం లాగా బయటకి వస్తారన్నారు. జగన్ సైకో ప్రభుత్వం పోతేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. జగన్(YS jagan) అరాచకాలు, అవినీతి ప్రజలకు అర్ధమైందని తెలిపారు. వచ్చే ఎన్నికలలో జగన్‌కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎంగా మళ్లీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలని, అరాచక సీఎంను తరిమికొట్టాలని కేశినేని చిన్ని పిలుపునిచ్చారు.
