జేసి బ్రదర్స్ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుగు స్టేట్స్ లో అందరికీ ఐడియా ఉంది. వీళ్ళు గతంలో ఆవేశంలో ఎలా ఊగిపోయారో చూశాం.

జేసి బ్రదర్స్ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుగు స్టేట్స్ లో అందరికీ ఐడియా ఉంది. వీళ్ళు గతంలో ఆవేశంలో ఎలా ఊగిపోయారో చూశాం. జగన్ నుండి మొదలుపెడితే మీడియా రిపోర్టర్ల వరకు అందరు వీళ్ళ నోట్లో నలిగిపోయినవాళ్ళే. అయితే ఇప్పుడు ఈ అకౌంట్లో ఒక హీరోయిన్ కూడా జాయిన్ అయింది. జేసి ప్రభాకర్ రెడ్డి ఈ సారి డోసెజ్ ఇంకా పెంచారు.

జేసి చాలా కొత్తగా ఆలోచిస్తున్నా అనుకుని ఓన్లీ లేడీస్ కు మాత్రమే ఎంట్రీ అంటూ ఒక న్యూ ఇయర్ పార్టీ అనౌన్స్ చేసారు. అక్కన్నుండే మొదలైంది మాధవీ లత గొడవ. ఈమె బిజెపి లో ఉండడంతో నేచురల్ గానే న్యూ ఇయర్ పార్టీస్ ను వ్యతిరేకిస్తుంది. అదే ధోరణిలో జేసి ఏర్పాటు చేసిన పార్టీకి వెళ్లొద్దని సోషియల్ మీడియాలో చెప్పింది. ఆ పార్టీ జరిగిన ప్లేస్ గురించి, మహిళల భద్రత గురించి ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.

ఇక్కడే ఎమ్.ఎల్. ఏ. కి కోపం వచ్చి.. ఆయన స్టైల్ ఆఫ్ కామెంట్స్ తో రెచ్చిపోయారు. ఆ హీరోయిన్ ఒక ప్రాస్టిట్యూట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంచం మంచి అమ్మాయిలను పెట్టుకోండి అంటూ పార్టీకి సూచనలు ఇచ్చారు జేసి ప్రభాకర్ రెడ్డి. ఇదే విషయం లో మహిళా కౌన్సిలర్లు మాధవీలత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆశ్చర్యం ఏంటంటే జేసి చేసిన వ్యాఖ్యల గురించి మాత్రం కౌన్సిలర్లు ఏమి మాట్లాడలేదు. మరి మాధవి లత ఎలాంటి యాక్షన్ కు సిద్ధమవుతుందో చూడాలి.

ehatv

ehatv

Next Story