TDP Leader Viral Video : మరో టీడీపీ నేత రాసలీలల వీడియో
మరో టీడీపీ నేత రాసలీలల వీడియో
ఏపీలో(AP ) టీడీపీ నేతల(TDP Leaders) రాసలీలల వ్యవహారాలు ఒకదాని వెనుక బయటపడుతున్నాయి. తాజాగా మరో నాయకుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా(Gajula Khader Basha) రాసలీలల వీడియో సంచలనంగా మారింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా అసలు స్వరూపం బట్టబయలైంది. పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఖాదర్.. వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఖాదర్ బాషా లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ వీడియో బయటకకు వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఖాదర్.. ఓ మహిళపై లైంగికంగా లోబర్చుకోవడం జరిగింది. ఈ విషయాన్ని బాధితురాలే వెల్లడించింది. దీంతో, అసలు విషయం బయటకు వచ్చింది. టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష వైసీపీ విమర్శిస్తోంది.
