ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradseh) మద్యం టెండర్లలో(Alcohl tender) టీడీపీ నేతలపై(TDP Leaders) ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradseh) మద్యం టెండర్లలో(Alcohl tender) టీడీపీ నేతలపై(TDP Leaders) ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి. సిండికేట్‌గా మారి షాపులు దక్కించుకున్నారని.. ఇతరులకు దక్కిన షాపుల్లో కమీషన్లు వసూలు చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. స్వయంగా సీఎం చంద్రబాబునాయుడే(CM chandrababu) మద్యం, ఇసుక(Sand) విషయంలో జోక్యం చేసుకోవద్దని టీడీపీ నేతలకు హెచ్చరించారు. అయినా కూడా వారి ప్రవర్తనా తీరులో మార్పురాలేదు. టీడీపీ నేతల కనుసన్నల్లో బెల్ట్ షాపులు కూడా నడుస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ(Balakrishna) ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గలో ఓ టీడీపీ నేత ఇంట్లో కర్నాటకకు(Karnataka) చెందిన మద్యం లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ అధికారుల దాడుల నేపథ్యంలో ఆ టీడీపీ నేత పరారీలో ఉన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం(hindu puram) నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతున్నాయి. హిందూపురం మండలం కొల్లకుంటలో టీడీపీ నేత మంజునాథ్‌(Manjunath) ఏపీ మద్యం కాకుండా కర్నాటకకు చెందిన మద్యం అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు మంజునాథ్‌ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా కర్నాటకకు చెందిన 1248 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల దాడుల నేపథ్యంలో మంజునాథ్‌ ఇంటి నుంచి పరారయ్యాడు.

Eha Tv

Eha Tv

Next Story