Devineni Uma Comments On Sajjala : సజ్జలపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్
కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం ఫెర్రీ ఘాట్ వద్ద టీడీపీ నేత(TDP Leader), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) ఆధ్వర్యంలో ఆ పార్టీ కౌన్సిలర్లు, ఇతర నేతలు కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. చేయని నేరానికి చంద్రబాబును(Chandrababu) అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి, సీఎం డౌన్.. డౌన్..
కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం ఫెర్రీ ఘాట్ వద్ద టీడీపీ నేత(TDP Leader), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) ఆధ్వర్యంలో ఆ పార్టీ కౌన్సిలర్లు, ఇతర నేతలు కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. చేయని నేరానికి చంద్రబాబును(Chandrababu) అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి, సీఎం డౌన్.. డౌన్.. వుయ్ వాంట్ జస్టీస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఆనాటి మంత్రి గోబెల్స్ తో హిట్లర్(Hitler) అసత్య ప్రచారాలు, అబద్ధాలు ప్రచారం చేశాడు. ఆనాడు జర్మన్ జాతి హిట్లర్, గోబెల్స్ వల్ల నాశనమైంది. ఈనాడు ఈ సకల శాఖ మంత్రిగా చలామణి అవుతున్న సన్నాసి సజ్జల గోబెల్స్ లాగా ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. సాఫ్ట్ వేర్ కి హార్డ్ వేర్ కి తేడా తెలియని దరిద్రుడు సజ్జల అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల అవినీతి అని మాట్లాడుతున్నాడు.. మూడువేల కోట్ల అవినీతి ఎక్కడ? అని ప్రశ్నించారు.
ఈ సైకో చేష్టల వల్ల మునిగిపోయాం.. అంతర్జాతీయంగా ఏ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావు అని నిన్న ఒక పారిశ్రామిక వద్ద వచ్చి గడ్డి పెట్టి వెళ్ళాడని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు(Chandrababu) లాంటి విజనరీ లీడర్ ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి జగన్(Jagan) పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఫైర్ అయ్యారు.
పట్టిసీమ దండగ.. పంపులు పీకుతా అన్నారు.. ఇప్పుడు పీకండి కృష్ణాడెల్టా రైతాంగం మీ వీపులు పగలగొడతారని హెచ్చరించారు. కొడాలి నాని, పేర్ని నాని అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా-గోదావరి పవిత్ర సంగమంలో మునిగి చెబుతున్నా.. సన్నాసుల్లారా మంచిని మంచి అని చెప్పండని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ ఉన్న సన్నాసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృష్ణా పవిత్ర హారతిని తీసేసి ఈ ప్రాంతాన్ని అసాంఘీక శక్తులకు అడ్డగా మార్చాడు.. సంఘవిద్రోహక శక్తులు ఇక్కడ బీరు సీసాలు పగలగొడుతున్నారని మండిపడ్డారు.