Chinthamaneni Prabhakar : భుజాలపై ఎక్కించుకొని పవన్ను గెలిపిస్తా.. చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
ఏలూరు(Eluru) జిల్లా దెందులూరు(Dhandheluru) మాజీ ఎమ్మెల్యే, టీడీపీ(TDP) సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్(Chinthamaneni Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన(Janasena), టీడీపీ(TDP) కలిసి పోటీ చేయనున్నయనే వార్తల నేపథ్యంలో.. చింతమనేని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Chinthamaneni Prabhakar
️ఏలూరు(Eluru) జిల్లా దెందులూరు(Dhandheluru) మాజీ ఎమ్మెల్యే(Ex-MLA), టీడీపీ(TDP) సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్(Chinthamaneni Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన(Janasena), టీడీపీ(TDP) కలిసి పోటీ చేయనున్నయనే వార్తల నేపథ్యంలో.. చింతమనేని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్(pawan) వస్తే తన సీటును ఇస్తానని వ్యాఖ్యానించారు. భుజాలపై ఎక్కించుకొని పవన్ ను గెలిపిస్తానని పేర్కొన్నారు. పవన్ దెందులూరు కోరుకుంటే త్యాగం చేసేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు. మా నాయకుడు తీసుకునేదే ఫైనల్ నిర్ణయం అని స్పష్టం చేశారు. సీటు ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.
