Buddha Venkanna : కొడాలి నానిపై నిప్పులు చెరిగిన బుద్ధా వెంకన్న
టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. కొడాలి నానీకి పిచ్చిపట్టింది.. పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కొడాలి నాని 420. చంద్రబాబు, లోకేష్ ను వెంట్రుక కూడా పికలేడని అన్నారు. లోకేష్ రాయలసీమ లో సింహం లాగా పాదయాత్ర చేస్తుంటే..
టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో(TDP Manifesto)పై మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న(Buddha Venkanna)ఫైర్ అయ్యారు. కొడాలి నానీకి పిచ్చిపట్టింది.. పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కొడాలి నాని 420. చంద్రబాబు, లోకేష్ ను వెంట్రుక కూడా పికలేడని అన్నారు. లోకేష్ రాయలసీమ లో సింహం లాగా పాదయాత్ర చేస్తుంటే.. పిచ్చికుక్క కొడాలి నాని వైసీపీ కార్యాలయంలో కూర్చుని తిడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు లాగుతున్నాడు. కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ను లాగుతున్నాడని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 16 స్థానాలు ఉన్నాయి.. మాట్లాడితే మాపై గెలువమంటున్నాడు.. మిగిలిన వారు తేడా గాళ్ళా.. అని ప్రశ్నించారు.
మహనాడులో మా పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు మాట్లాడితే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీసీలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. నువ్వుఎవడవురా..? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ లను కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు.. నీ అంతు చూస్తాం అంటూ హెచ్చరించారు. బీసీపై నీ ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక రకాలైన కేసులు పెట్టారు. అచ్చెం నాయుడుపై కూడా కేసులు పెట్టారని గుర్తుచేశారు.
చంద్రబాబు నాయుడు ఏడ్చారు అంటున్నావు.. తన భార్యనంటే దుఃఖం పట్టారని అన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న చంద్రబాబు కనుసైగ చేస్తే మీరు ఎమైపోతారో.. గుర్తు చేసుకొండని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన సమయంలో టీడీపీలో ఉన్న కొడాలి నానీ.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని అన్నారు. కొడాలి నానీ బీసీ లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కొడాలి నాని నువ్వు ఉల్లిపాయ పకోడిగాడివని.. నిన్ను ఏడిపించడానికి మాకు ఎంత సమయం పట్టదని అన్నారు. చంద్రబాబు నాయుడును, చంద్రబాబు కుటుంబాన్ని అన్నవారు బంగాళాఖాతంలో కలిసిపోయారన్నారు. రేపు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత 20 ఎకరాల స్థలం కేటాయించాలి. అమరావతి వైసీపీ పిచ్చికుక్కల కోసం కేటాయించాలి.. ఇది మేనిఫెస్టోలో పెట్టాలని టీడీపీ అధినేతను కోరారు.
జోగి రమేష్ కు చంద్రబాబు ఇంటి మీదకు గొడవకు వెళ్ళిన తరువాత మంత్రి పదవి ఇచ్చారని.. మంత్రి పదవి ఇచ్చిన జగన్ ఇంటికి మాత్రం వెళ్ళేలేదని ఎద్దేవా చేశారు. వరుసగా వైసీపీ నాయకుల ఒక్కొక్క రి జాతకాలు బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని ఎమన్నారంటే..
చంద్రబాబును పొగిడించడానికే మహానాడు పెట్టారని.. మహానాడు వేదిక మీద బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదని కొడాలి నాని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేష్ బొమ్మ ఎలా పెడతారని అన్నారు. ఎన్‌టీఆర్ పేరుతో 4 ఓట్లు సంపాదించుకోవడం కోసమే ఈ తపనంతా అని అన్నారు. చంద్రబాబు వెంట ఉన్నది.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, పవన్ కల్యాణ్ మాత్రమేనని అన్నారు. వీళ్లెవరూ బీసీలు కాదు.. అధికారం ఇస్తే బాబుతో పాటు వీళ్లే బాగుపడతారని అన్నారు.
చంద్రబాబుకు అధికారం ఇస్తే తన సామాజికవర్గానికే మంత్రి పదవులు ఇస్తారని అన్నారు. చంద్రబాబును ‘ఆల్‌ఫ్రీ బాబు’ అని వైఎస్సార్ ఆనాడే చెప్పారని.. చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారని విమర్శలు గుప్పించారు కొడాలి నాని. నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని.. అందుకే టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేయవవద్దని నిర్మాతలను బెదిరించారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేకపోవడంతో ఆయన తల్లిని ఇష్టం వచ్చిన తిట్టిపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు భార్య, కోడలు మాత్రమే ఆడవాళ్లా?.. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఆడవాళ్లు కాదా? అని మాజీమంత్రి కొడాలి నాని నిలదీశారు.