Bonda Uma : డీజీపీ, డీఐజీలు కలుగజేసుకుని అవినాష్ రెడ్డిని సీబీఐకు అప్పజెప్పాలి
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు ఎస్పీ సహకరించటం లేదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. ఎస్పీ తాడేపల్లి ఆదేశాలు పాటిస్తున్నారని అన్నారు. పులివెందుల కిరాయి మూకల అధీనంలో కర్నూలు హాస్పిటల్ ఉందంటే ఏపీ పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.
మాజీమంత్రి వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) అరెస్టుకు ఎస్పీ సహకరించటం లేదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా(Bonda Uma) ఆరోపించారు. ఎస్పీ తాడేపల్లి(Thadepalli) ఆదేశాలు పాటిస్తున్నారని అన్నారు. పులివెందుల కిరాయి మూకల అధీనంలో కర్నూలు హాస్పిటల్(Kurnool Hospital) ఉందంటే ఏపీ పోలీసులు(AP Police) ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హంతకుడిని పోలీసులు కాపాడటమా.. ఏపీ పోలీసులకు ఇంత కన్నా అవమానం లేదని విమర్శించారు. డీజీపీ(DGP), డీఐజీ(DIG)లు కలుగజేసుకుని.. అవినాష్ రెడ్డిని సీబీఐ(CBI)కు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. తల్లి అనారోగ్యం నిజమే అయితే అవినాష్ తల్లిని హైదరాబాద్ అపోలో లాంటి ఆసుపత్రికి తీసుకు వెళతారు.. కర్నూల్ లో చేర్చరని బోండా ఉమా అన్నారు.
ఇదిలావుంటే.. నాలుగు రోజులుగా కర్నూలు విశ్వభారతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తల్లి శ్రీలక్ష్మి దగ్గరే ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన 19న విచారణకు హాజరుకాకపోవడంతో.. 22న ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు రావాల్సిందేనని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పట్లో రాలేనని సీబీఐకు అవినాష్ లేఖ రాయడంతో.. హైడ్రామా కొనసాగుతోంది.