Atchannaidu : ఐదు నెలలే సమయం ఉంది.. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి
రాష్ట్రంలో ఓటర్ లిస్టు కన్నా వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు అయింది.
రాష్ట్రంలో ఓటర్ లిస్టు(Voter List) కన్నా వైసీపీ ప్రభుత్వం(YCP Govt) పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(TDP Leader Atchannaidu) ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ(Sangam Dairy) చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra) పై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఆయనపై చేబ్రోలు పోలీసులు(Chebrolu Police) హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయమై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైపల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. పాడిరైతుల ప్రగతికి కృషిచేసే నరేంద్ర.. రైతులపైనే దాడి చేయించారంటే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. ఇటువంటి అక్రమ కేసులతో వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారని అన్నారు.
సంఘం డెయిరీని అక్రమించుకోవాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని.. అది ఫలించకపోవటంతో రైతుల(Farmers)తో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలా ప్రశ్నించనవారిని వేధించటమే పనిగా ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు..? ఇంకా కేసులు పెట్టి ఏం చేస్తారు..? అంటూ ప్రశ్నించారు. మీకు ఇంకా 5 నెలలే సమయం ఉంది..ఇకపై మీరు ఎవరిపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. మీరు పెట్టే కేసులకు ఎవ్వరు భయపడరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతున్నారన్నారు.