ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(AP politics) దాదాపు తిరుమల లడ్డూ(Tirumala laddu) వ్యవహారం చుట్టూనే తిరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(AP politics) దాదాపు తిరుమల లడ్డూ(Tirumala laddu) వ్యవహారం చుట్టూనే తిరుగుతున్నాయి. గత రెండు వారాలుగా లడ్డూ మీద రాద్ధాంతం జరగుతోంది. జగన్(YS Jagan) తిరుమలలో అడుగుపెట్టాలనుకుంటే డిక్లరేషన్‌పై(Declaration form) సంతకం చేయించాలని హిందూత్వ సంఘాల నుంచి ఎడతెగని డిమాండ్‌ నేపథ్యంలో వైసీపీ(YCP) అధినేత యాత్రను విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. తిరుమల వెళ్లాలనుకున్న జగన్‌ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే పర్యటనను రద్దు చేసుకున్నాడని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి(Venkata ramana reddy) విమర్శించారు. ఒకప్పుడు సోనియా గాంధీ(Sonia gandhi), భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం(Abdual kalam) వంటి వారు తిరుమలకు వెళ్లే ముందు డిక్లరేషన్ ఇచ్చారు. జగన్ నిజంగానే సోనియా, కలాం ఇద్దరికంటే గొప్పోడని అనుకుంటున్నాడా.. ఆ ఇద్దరు ప్రముఖుల కంటే ఎక్కువ ప్రభావశీలి అని అతను భావిస్తున్నాడా? అని ఆనం ప్రశ్నించారు.

Updated On 28 Sep 2024 10:06 AM GMT
Eha Tv

Eha Tv

Next Story