JC Prabhakar Reddy : పెద్దారెడ్డిని పంచె ఊడదీసి కొడతా.... జేసీ ప్రభాకర్‌రెడ్డి
మొన్నటి వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలో ఉంది. అప్పుడు పప్పులుడకలేదు.
మొన్నటి వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలో ఉంది. అప్పుడు పప్పులుడకలేదు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీ(TDP) అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీవారికి ఆటోమాటిక్‌గా బలం వచ్చేసింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి(JC Prabhakar) కూడా బలం వచ్చింది. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తన కుటుంబ శత్రువు అయిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని(Kethireddy Peddi Reddy) నానా మాటలన్నారు. ఆయన తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతానని హెచ్చరించారు. పెద్దరెడ్డిని కొట్టకుండా వదిలిపెట్టమని స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. జేసీ ఫ్యామిలీకి కేతిరెడ్డి కుటుంబానికి అసలు పడదు. ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న సూర్యనారాయణరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక జేసీ కుటుంబం ఉన్నదన్నది కేతిరెడ్డి కుటుంబం నమ్మకం. రెండు కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేయకపోయినా మండుతుంటుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి పెద్దారెడ్డి దండయాత్రకు వెళ్లారు. పెద్దారెడ్డి చర్యను అప్పట్లో చాలా మంది ఖండించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిలో విశ్వాసం పెరిగింది. ఇటీవల రవాణాశాఖ అధికారులపై జేసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పెద్దారెడ్డిపై కూడా అలాగే మాట్లాడారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో తనకు నలుగురైదుగురు శత్రువులు ఉన్నారని, వారిపై చట్టపరంగా వెళతానని జేసీ చెప్పారు. కేతిరెడ్డిని, ఆయన ఇద్దరు కొడుకులను ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేయడం కొసమెరుపు.