AP Politics : సీట్ల సర్దుబాటులో తకరారు.. కూటమి అభ్యర్థులు బేజారు
ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పొత్తులు(Alliance) పెట్టుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. కేవలం జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)ని అధికారంలోకి దించేయడానే పొత్తులు పెట్టుకున్న టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) నియోజకవర్గాలలో రేగుతోన్న అసంతృప్తి జ్వాలలను పట్టించుకోవడం లేదు.
ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పొత్తులు(Alliance) పెట్టుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. కేవలం జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)ని అధికారంలోకి దించేయడానే పొత్తులు పెట్టుకున్న టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) నియోజకవర్గాలలో రేగుతోన్న అసంతృప్తి జ్వాలలను పట్టించుకోవడం లేదు. ఎప్పట్నుంచో పార్టీని అంటిపెట్టుకుని, పార్టీ కోసం సొంత డబ్బును వెచ్చించిన వారిని పట్టించుకోకుండా బలవంతంగా తమ మీద అభ్యర్థులను రుద్దడాన్ని నేతలు సహించలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో(West Godavari)చాలా మంది అధినాయకత్వాల ధోరణి పట్ల రగిలిపోతున్నారు. ఉండి నియోజకవర్గంలో కలవపూడి శివ(Kalavapudi Siva) ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. భీమవరం నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థికి సొంత పార్టీ నేతలు ఏ మాత్రం సహకరించడం లేదు. నరసాపురం, తణుకు నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాలు దక్కాయి. తణుకు, ఆచంట, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలు తెలుగుదేశంపార్టీకి లభించాయి. నరసాపురం టికెట్‌ను జనసేనాని పవన్‌కల్యాణ్ తనకే ఇచ్చారని బొమ్మిడి నాయకర్ చెబుతూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కానీ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పింది వేరుగా ఉంది. ప్రజాగళం సభకు సంఘీభావ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మిడి నాయకర్‌కు పవన్ టికెట్ ఇచ్చారన్న సమాచారం తనకు లేదని చెప్పారు. సీటు తనకు గ్యారంటీ అని సుబ్బారాయుడు ప్రచారం చేసుకుంటున్నారు. చిత్రమేమిటంటే ఆయన జనసేనలో మొన్నీమధ్యనే చేరారు. నాయకర్, సుబ్బారాయుడులిద్దరూ ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఎవరి వెంట వెళ్లాలో జనసేన క్యాడర్‌కు తెలియడం లేదు. పోనీ తెలుగుదేశం పార్టీలోనైనా ఐకమత్యం ఉందా అంటే అదీ లేదు. వర్గ విభేదాలతో టీడీపీ సతమతమవుతోంది. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వర్గం, పార్టీ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు వర్గం పరస్పరం తిట్టుకుంటున్నారు. ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి రామరాజును త్వరలో తీసేస్తారంటూ బండారు వర్గం ప్రచారం చేస్తోంది. పార్టీ నుంచి బండారును తరిమేయడం గ్యారంటీ అని రామరాజు వర్గం చెబుతోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశంపార్టీ మూడోస్థానంలో నిలిచింది. ఇప్పటికీ ఆ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. వారాహి యాత్ర సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి విడివాడ రామచంద్రరావుకు జనసేనాని టికెట్ హామీ ఇచ్చారు. అధినేత మాట తప్పరన్న భావనతో టికెట్ తనకేనని రామచంద్రరావు గట్టిగా నమ్మారు. ఇప్పుడు తణుకు సీటు తెలుగుదేశంపార్టీకి వెళ్లిపోవడంతో రామచంద్రరావు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశంపార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ. అవమాన భారంతో తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఉండి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న కలవపూడి శివకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. జనసేనకు కేవలం 21 సీట్లు మాత్రమే ఇవ్వడంతో ఆ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నీరుగారిపోయింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. అయిదేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు ఎలాగోలా జనసేన నుంచి భీమవరం టికెట్ తెచ్చుకున్నారు. కాకపోతే క్యాడరే ఆయనతో అంటీముట్టనట్టుగా ఉంటోంది. రామాంజనేయులు అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసేన కార్యకర్తలతో కాకుండా ఆయన పాత పరిచయాలున్న టీడీపీ క్యాడర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నది వారి కంప్లయింట్. మొత్తం మీద కూటమిలో రోజుకో గొడవ జరుగుతోంది. నామినేషన్ల సమయానికల్లా సద్దుమణుగుతుందో లేదో చూడాలి.