Bala Krishna : బాలకృష్ణకు టికెట్ వద్దంటున్న పత్రికాధిపతి.. కారణమేమిటంటే..!
మరో మూడు నెలల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు కలిసే వెళ్లాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు అప్పుడెప్పుడో నిర్ణయం తీసుకున్నాయి. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడే టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేనాని పవన్‌కల్యాన్(Pawan Kalyan) బహిరంగ ప్రకటన చేశారు. అయితే సీట్ల పంపణి విషయం మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయంపై ఇప్పటికే ఓసారి చంద్రబాబు(Chandrababu), పవన్‌లు భేటి అయ్యారు. లెక్కలు తేలలేదు. పంపకాలపై ఓ అవగాహన కుదరలేదు. పొత్తుపై బీజేపీ(BJP) నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత మరోసారి చంద్రబాబు, పవన్ సమావేశం ఉంటుంది.
మరో మూడు నెలల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు కలిసే వెళ్లాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు అప్పుడెప్పుడో నిర్ణయం తీసుకున్నాయి. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడే టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేనాని పవన్‌కల్యాన్(Pawan Kalyan) బహిరంగ ప్రకటన చేశారు. అయితే సీట్ల పంపణి విషయం మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయంపై ఇప్పటికే ఓసారి చంద్రబాబు(Chandrababu), పవన్‌లు భేటి అయ్యారు. లెక్కలు తేలలేదు. పంపకాలపై ఓ అవగాహన కుదరలేదు. పొత్తుపై బీజేపీ(BJP) నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత మరోసారి చంద్రబాబు, పవన్ సమావేశం ఉంటుంది. అందులో సీట్ల పంపిణీపై ఓ స్పష్టత రావచ్చు. పొత్తులో భాగంగా ఈసారి జనసేన(Janasena) ఎక్కువ స్థానాలను కోరే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య కాబట్టి పవన్ అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ మనోభావాలు దెబ్బతినకుండా చంద్రబాబు ఒకట్రెండు సీట్లలో కోత పెట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ చతురుడు కాబట్టి! ఈ రెండు పార్టీలే సీట్ల పంపకాలలో తకరారు నడుస్తుంటే ఓ ప్రముఖ పత్రికాధిపతి మరి తన సంగతి కూడా తేల్చాలంటూ సీన్‌లోకి ఎంటరయ్యారట! తన వాటాగా మూడు ఎంపీ టికెట్లు(MP Tickets), ఎనిమిది అసెంబ్లీ టికెట్లు(Assembly tickets) ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట! ఈసారి హిందూపురం (Hidupuram)అసెంబ్లీ టికెట్‌ను బాలకృష్ణకు ఇవ్వకూడదని పట్టుబడుతున్నారని వినికిడి. బాలకృష్ణకు(Balakrishna) హిందూపురం లోక్‌సభ (Loksabha)టికెట్ కేటాయించడం ఉత్తమమని చంద్రబాబు చెవిన వేశారట సదరు ప్రతికాధిపతి. ఎమ్మెల్యేగా గెలిస్తే బాలకృష్ణకు క్యాబినెట్‌లో చోటు కల్పించాల్సి వస్తుందని, ఆ బెడద లేకుండా ఉండాలంటే బాలయ్యబాబును ఢిల్లీకి (Delhi)పంపించడమే ఉత్తమమని బాబుకు హితబోధ చేశారట! ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరించారని అంటున్నారు. బాలకృష్ణ మీదనే కాదు, ఆయన అల్లుడు భరత్‌పై (Bharat)కూడా నీతి పలుకులు పలికే ఆయనకు కోపం ఉన్నట్టుగా ఉంది. అందుకే విశాఖపట్నం(Vishakapatnam) టికెట్ భరత్‌కు దక్కుకుండా ఉండేందుకు పురంధేశ్వరి(Purandeshwari) ద్వారా నరుక్కురావాలని ప్లాన్ వేశారు. ఒకవేళ టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలిస్తే ఇక్కడ నుంచి బరిలో దిగడానికి కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సిద్ధమవుతున్నారు. పొత్తు పొడిస్తే మాత్రం విశాఖ ఎంపీ సీటు అనివార్యంగా బీజేపీకి వదిలేయాల్సి ఉంటుంది. అప్పుడు మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం భరత్‌కు లేకుండాపోతుంది.
పనిలో పనిగా అచ్చెన్నాయుడును(Atchannaidu) కూడా అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్‌కు పంపించమని ఆ ప్రతికాధిపతి చెప్పారట! రేప్పొద్దున పార్టీ గెలిచి లోకేశ్(Lokesh) ముఖ్యమంత్రి అయితే అచ్చెన్నాయుడు వంటి సీనియర్లతో ఇబ్బంది పడాల్సి వస్తుందన్నది పత్రికాధిపతి దూరాలోచన! ఎంతైనా టీడీపీ మేలు కోరే వ్యక్తి కదా! ఇదిలా ఉంటే విజయవాడ(Vijayawada) లోకసభ సీటు కూడా తనకు వదిలేయాలని డిమాండ్ చేశారట! ఇలా మొత్తంగా తనకు ఎనిమిది అసెంబ్లీ టికెట్లు, మూడు లోక్‌సభ టికెట్లు కావాల్సిందేనని గట్టిగా అడుగుతున్నారని అమరావతిలో చెప్పుకుంటున్నారు.