TDP Jaleel Khan : టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుని చస్తా... బీకామ్ ఫిజిక్స్ సంచలన వ్యాఖ్యలు
బీకామ్‌లో ఫిజిక్స్ చదివిన మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్(Jalil Khan) గుర్తున్నారు కదా! ఎందుకు గుర్తుండదు.. బీకామ్‌లో ఫిజిక్స్ చదివిన అరుదైన నాయకుడాయె! ఈ అపర మేథావి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో(YSRCP) ఉండటమేమిటి? ఉంటే గింటే తమ పార్టీలో కదా అని తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) భావించి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వైనమూ తెలుసుకుకదా! ఇప్పుడా జలీల్‌ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

TDP Jaleel Khan
బీకామ్‌లో ఫిజిక్స్ చదివిన మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్(Jaleel Khan) గుర్తున్నారు కదా! ఎందుకు గుర్తుండదు.. బీకామ్‌లో ఫిజిక్స్ చదివిన అరుదైన నాయకుడాయె! ఈ అపర మేథావి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో(YSRCP) ఉండటమేమిటి? ఉంటే గింటే తమ పార్టీలో కదా అని తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) భావించి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వైనమూ తెలుసుకుకదా! ఇప్పుడా జలీల్‌ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈయన విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేద్దామనుకుంటున్నారు. ఈయన అనుకుంటే సరిపోతుందా? చంద్రబాబు అనుకోవాలి. ఇప్పటి వరకు ఆయన ఓ నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ్నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశంపార్టీకే చెందిన మరో ఇద్దరు రెడీగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalayan) కూడా విజయవాడ పశ్చిమ తమకే కావాలని పట్టుబడుతున్నారు. అందుకే చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. విజయవాడ పశ్చిమ టికెట్ తనదేనని, తప్పకుండా గెలిచి తీరతానని జలీల్‌ఖాన్ చెబుతున్నారు. టికెట్ అందరూ అడుతారని, గెలిచే సత్తా కూడా ఉండాలి కదా అని జలీల్ ఖాన్ తెలిపారు. విలువలతో కూడిన క్యారెక్టర్ ఉండాలని, అలాంటి లక్షణం తనకు మాత్రమే ఉందని చెప్పారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుని చస్తానని(Suicide) సంచలన కామెంట్స్ చేశారాయన. తర్వాత సవరించుకున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ముస్లిం మైనారిటీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మాట మార్చారు. పైగా ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఆ పని చేయడానికి ప్రయత్నించారని, తాను అడ్డుకున్నానని జలీల్‌ఖాన్ తెలిపారు. ఈ హెచ్చరికల తర్వాత టీడీపీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
