TDP Jadda Rajasekhar : ప్రజాబలం ఉంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయవచ్చు కదా!
ఏ ముహూర్తాన టీడీపీ-జనసేన-బీజేపీ(TDP-Janasena-BJP) ఒక్కటయ్యాయో తెలియదు కానీ ఆ పర్యవసానాలు మాత్రం చాలా చోట్ల కనిపిస్తున్నాయి. పిఠాపురం(Pithapuram)లో ఏం జరుగుతున్నదో మనం చూశాం! తిరుపతి(Tirupati)లోనూ అదే జరుగుతోంది. అక్కడ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సీట్ల సర్దుబాటులో తిరుపతి అసెంబ్లీ సీటు(Tirupati Assembly Seat) జనసేన(Janasena)కు లభించింది.
ఏ ముహూర్తాన టీడీపీ-జనసేన-బీజేపీ(TDP-Janasena-BJP) ఒక్కటయ్యాయో తెలియదు కానీ ఆ పర్యవసానాలు మాత్రం చాలా చోట్ల కనిపిస్తున్నాయి. పిఠాపురం(Pithapuram)లో ఏం జరుగుతున్నదో మనం చూశాం! తిరుపతి(Tirupati)లోనూ అదే జరుగుతోంది. అక్కడ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సీట్ల సర్దుబాటులో తిరుపతి అసెంబ్లీ సీటు(Tirupati Assembly Seat) జనసేన(Janasena)కు లభించింది. ఈ మధ్యనే జనసేన తీర్థం పుచ్చుకున్న చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మల్యే ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) అలియాస్ జంగాలపల్లి శ్రీనివాసులకు టికెట్ దొరికింది. పాపం టికెట్ తమకు గ్యారంటీ అని అనుకున్న తెలుగుదేశంపార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ(Sugunamma), సీనియర్ నాయకుడు పూకా విజయ్‌కుమార్(TDP Leader Vuka Vijay Kumar)లకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ఎప్పట్నుంచో జనసేన జెండా పట్టుకుని తిరుగుతున్న పసుపులేటి హరిప్రసాద్(Pasupuleti Hariprasad), ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాయల్ కాని రాయల్ హతాశులయ్యారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) టికెట్ అనౌన్స్ చేయగానే ఆశావహులంతా కలిసి నాన్ లోకల్ అంశాన్ని ఎత్తుకున్నారు. జంగాలపల్లి శ్రీనివాసుల(Jangalapalli Srinivasulu)కు సహకరించేది లేదని కరాఖండిగా చెప్పేశారు. దీంతో అటు టీడీపీ అధిష్టానం, ఇటు జనసేన అధినాయకత్వం కంగారుపడింది. అందరిని పిలిచి వార్నింగ్‌లు ఇచ్చాయి. దాంతో వారు కొంచెం మెత్తపడ్డారు. పసుపులేటి హరిప్రసాద్ అధిష్టానం చెప్పినట్టు జంగాలపల్లి శ్రీనివాసులకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు మాత్రం ఏం చేయాలో పాలుపోవడం లేదు. జనసేన, టీడీపీ నేతలలో స్థానికులకు ఎవరికి టికెట్ ఇచ్చినా మద్దతు ఇస్తానని, స్థానికేతరులకు సపోర్ట్ చేయమని చెప్పేశారు. అక్కడితో ఆగకుండా తనకు టికెట్ ఇస్తానంటే జనసేన పార్టీలో చేరడానికి కూడా సిద్ధమేనని అన్నారు. సుగుణమ్మ మాట వినేందుకు టీడీపీ-జనసేన అధిష్టానాలు సిద్ధంగా లేవు. ఇలా బతిమాలుకునే బదులు ఇండిపెండెంట్‌గా పోటీ చేయవచ్చు కదా అని ఆమెకు కొందరు సూచిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం కనీసం విలువలు మర్చిపోయి పార్టీ మారతానని బహిరంగంగా చెప్పడమేమిటని కొందరు విమర్శిస్తున్నారు. తనతో చంద్రబాబు మాట్లాడేందుకు అయిష్టత చూపుతున్నా ఇంకా ఆ పార్టీని పట్టుకుని వేలాడటం ఏమిటన్నది వీరి ప్రశ్న! ప్రజలలో తనకు బలముందని సుగుణమ్మ అనుకుంటే సత్యవేడు టీడీపీ నేత రాజశేఖర్‌లా స్వతంత్రంగా పోటీ చేయవచ్చు కదా! అని అంటున్నారు. సత్యవేడులో ఏం జరిగిందంటే, అక్కడి అసెంబ్లీ టికెట్‌ను చంద్రబాబు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలా(Koneti Adimulam)నికి ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుంటూ, పార్టీ జెండా మోసుకుంటూ వచ్చిన జడ్డా రాజశేఖర్(Jadda Rajasekhar)కు ఇది బాధ కలిగించింది. గత ఎన్నికల్లో ఆదిమూలం చేతిలోనే రాజశేఖర్ ఓడిపోయారు. ఈసారి గెలుపు గ్యారంటీ అని రాజశేఖర్ అనుకున్నారు. అయిదేళ్లుగా గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు. తీరా చంద్రబాబు(Chnadrababu) తనకు హ్యాండ్ ఇచ్చేసరికి రాజశేఖర్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నారు. ఆయన, ఆయన కుటుంబసభ్యులు ఇళ్లుళ్లు తిరుగుతున్నారు. రాజశేఖర్ కనబర్చిన తెగువను ఆదర్శంగా తీసుకుని ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని ఆమె అభిమానులు చెబుతున్నారు.