Vangalapudi Anitha : జగన్‌పై చర్యలు.. హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్‌లో(andhra pradesh) అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి, అధికారం కోల్పోయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు(YSRCP) మధ్య మాటల దాడి మరింత ముదురుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో(andhra pradesh) అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి, అధికారం కోల్పోయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు(YSRCP) మధ్య మాటల దాడి మరింత ముదురుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు(Political murders) జరిగాయన్నది మాజీ సీఎం జగన్ ఆరోపణ. ఈ ఆరోపణకు కౌంటర్‌గా ఇవాళ హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi anitha) ప్రెస్‌మీట్(Press meet) పెట్టి జగన్‌ను దులిపేశారు. ప్రభుత్వంపై బుదర చల్లడానికి జగన్ ఇష్టానికి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే చర్యలకు సిద్ధంగా ఉండాలని అనిత అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగే రాజకీయ హత్యలు జరిగాయని, ఇందులో ముగ్గురు తెలుగుదేశంపార్టీ కార్యకర్తలేనని అనిత వివరించారు. 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ప్రభుత్వంపై జగన్ బురద చల్లుతున్నారని విమర్శించారు. హత్యల సమాచారం ఉంటే వివరాలు తమకు అందించాలని, సమాచారం లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని అనిత అన్నారు. ప్రజలు ఇంకా మీ మాటలు నమ్ముతారనుకోవడం భ్రమేనని చెప్పారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే వేధించారని, గతంలో పెట్టిన కేసులపై బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారని వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ చెబుతున్నారని, అధికారం కోల్పోయిన నెల రోజులకే ఆయన మైండ్ పనిచేయట్లేదని అనిత సెటైర్లు విసిరారు.